గుండు హనుమంతరావు ధన్యజీవి : బ్రహ్మానందం

Mon,February 19, 2018 09:57 AM
Brahmanandam condolence to Gundu Hanumantharao dead body

హైదరాబాద్ : హాస్యనటుడు గుండు హనుమంతరావు భౌతికకాయం వద్ద కమెడియన్ బ్రహ్మానందం పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. గుండు హనుంతరావు ధన్యజీవి అని కొనియాడారు. తనకున్న అతి తక్కువ మంది మిత్రుల్లో హనుమంతరావు ఒకరు అని తెలిపారు. హాస్యప్రదర్శనలతో ఎంతో మందిని ఆయన అలరించారని గుర్తు చేశారు. జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. హనుమంతరావు ఆత్మకు శాంతిని కలుగజేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బ్రహ్మానందం తెలిపారు.

2838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS