బ్రహ్మానందంకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు..

Sun,November 5, 2017 05:56 PM
Brahmanandam bags Life time Achievement Award


ఢిల్లీ: తెలుగు అకాడమీ 29వ వార్షికోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ప్రతిభా భారతి పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ రంగంలో సేవలందించిన ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా మురళీమోహన్, తనికెళ్లభరణి, అలీ, రవిబాబు, సాయికుమార్‌కు పురస్కారం ప్రదానం చేశారు. సామాజిక సేవలో గురుప్రసాద్, విద్యారంగంలో రావూరి వెంకటస్వామి, వైద్యరంగంలో దశరథ రామారెడ్డి, ఆర్థిక రంగంలో మహేవ్ వై రెడ్డికి పురస్కారాలు ప్రదానం చేశారు. అసోం గవర్నర్ జగదీశ్ ముఖి, కేంద్రమంత్రి మహేశ్ శర్మ, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ పిఎస్ నారాయణ పురస్కారాలు అందజేశారు.

1954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS