క‌త్తి రెడ్డిగా కామెడీ కింగ్

Sun,July 2, 2017 10:53 AM
brahmanandam as kathi reddy

కామెడీకి కెరాఫ్ అడ్రెస్ బ్ర‌హ్మ‌నందం. వెండితెర‌పై న‌వ్వులు పువ్వులు పూయించే ఈ కామెడీ బ్ర‌హ్మ హ‌వా ఇప్పుడు అంత‌గా లేదు. ఒక‌ప్పుడు బ్ర‌హ్మ‌నందం లేకుండా సినిమా లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లోను కొన్ని సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌యోగమే చేయ‌బోతున్నారు నిర్మాత‌లు. పూర్తి కామెడీ ఎంట‌ర్ టైనర్ గా క‌త్తి రెడ్డి అనే టైటిల్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. దీనికి ట్యాగ్ లైన్ ఎత్తితే.. దించ‌డు. వి ర‌వివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో రచ్చ ర‌వి కీ రోల్ పోషించ‌నున్నాడ‌ట‌. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తార‌ని తెలుస్తుండ‌గా, క‌త్తి రెడ్డిగా బ్ర‌హ్మానందం ఎలా మెప్పిస్తాడో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

1818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS