గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బ్రహ్మానందం

Sun,July 29, 2018 03:51 PM
brahmanandam accept MLA Jeevan Reddy  green challenge

హైదరాబాద్: హరితహారంలో భాగంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మొక్కలు నాటి తెలుగు సినీ దర్శకులు వివి వినాయక్, సీనినటులు బ్రహ్మనందం, పోలీస్ కమిషనర్ కార్తీకేయకు సవాల్ చేసిన విషయం తెలిసిందే. జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను తాజాగా బ్రహ్మానందం స్వీకరించారు. తన నివాసంలో మొక్కలు నాటి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో తనను భాగస్వామ్యం చేసిన జీవన్‌రెడ్డికి బ్రహ్మానందం కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందంకు జీవన్‌రెడ్డి ట్విటర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసరాలి. ఆ ముగ్గురు మూడు మొక్కల చొప్పుననాటి మిగతావారికి సవాల్ విసరాలిఅనే ఉద్దేశంతో ఈ నెల 17న హైదరాబాద్‌లో మొదలైన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది.

5774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS