మంత్రి దృష్టికి డీజే వివాదం..!

Tue,June 13, 2017 05:59 PM
brahmana association members meet talasani

దువ్వాడ జగన్నాథం చిత్రంలోని గుడిలో బడిలో మడిలో అనే సాంగ్ రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని సాహిత్యం బ్రాహ్మణులని అవమాన పరిచే విధంగా ఉందని, సాహితి రాసిన ‘నమకం.. చమకం’ , ‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’ అనే పదాలు రుద్ర స్తోత్రాన్ని అవమానించేవిగా ఉన్నాయని, వాటిని తొలగించాలని బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. తొలగించని పక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని, పోలీస్ ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేస్తామంటూ వారు హెచ్చరించారు కూడా. అయితే హరీష్ శంకర్ ని క‌లిసిన‌ బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులు కొంద‌రు ఈ విష‌యంపై చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో హరీష్ శంకర్ తో నిర్మాత దిల్ రాజు పాటలోని లిరిక్స్ ను మార్చేందుకు అంగీకరించారు. త్వరలోనే పదాలు తొల‌గించి కొత్త సాంగ్ కూడా విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. కాని ఇప్ప‌టికి ఆ ప‌దాలు తొల‌గించ‌క‌పోవ‌డంతో బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలసి డీజే చిత్రంపై కంప్లైంట్ చేశారట‌. పాట‌లోని అశ్లీష ప‌దాల‌ను తొల‌గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విన్న‌వించుకున్నార‌ట‌. మరి దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

2787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles