'బాయ్స్2' కి గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ్డ‌ట్టేనా ?

Tue,January 22, 2019 11:14 AM

సిద్ధార్ద్‌, జెనీలియా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం బాయ్స్. 2003లో వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. చిత్రంలో థ‌మ‌న్ కూడా ముఖ్య పాత్ర‌లో క‌నిపించాడు. ఇప్ప‌టికి ఈ సినిమా సినీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంటుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందా అనే అనుమానాలు థ‌మ‌న్ లేటెస్ట్‌ పోస్ట్‌ని బ‌ట్టి అభిమానుల‌లో రేకెత్తుతున్నాయి. త‌న ట్విట్ట‌ర్‌లో సిద్ధార్ద్‌తో సెల్ఫీ దిగిన ఫోటోని షేర్ చేస్తూ బాయ్స్ 2 అనే కామెంట్ పెట్టారు థ‌మ‌న్. దీనిని రీ ట్వీట్ చేసిన సిద్ధార్ద్ గుడ్ బాయ్స్ ఎల్ల‌ప్పుడు గుడ్ బాయ్సే అని కామెంట్ పెట్టాడు. దీంతో బాయ్స్‌కి సీక్వెల్ త‌ప్ప‌క‌ ఉంటుంద‌నే చ‌ర్చ అభిమానుల‌లో మొద‌లైంది. తొలి పార్ట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శంక‌ర్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాయ్స్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. సిద్ధార్థ్‌..‘అంధాధున్‌’ అనే బాలీవుడ్‌ సినిమా రీమేక్‌లో నటిస్తున్న విష‌యం విదిత‌మే.
2393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles