మెగా హీరో సినిమాకి యాక్ష‌న్ చెప్పిన బోయ‌పాటి

Fri,January 19, 2018 10:35 AM
boyapati rolls the new project

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను తొలిసారి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, నేడు చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి త‌న ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు. మొద‌టి షెడ్యూల్‌లో సీనియ‌ర్ ఆర్టిస్ట్స్‌, స‌పోర్టింగ్ రోల్స్‌పైన కొన్ని స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్న బోయ‌పాటి రెండో షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన సన్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. ఫిబ్ర‌వరిలో రెండో షెడ్యూల్ మొద‌లు కానుంది. రామ్ చ‌ర‌ణ్‌ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ రంగ‌స్థ‌లం 1985 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నెలాఖ‌రుకి పూర్తి కానుంద‌ని తెలుస్తుంది. ఆ త‌ర్వాత మేకోవ‌ర్ పూర్తిగా మార్చుకొని బోయ‌పాటి టీంతో క‌ల‌వ‌నున్నాడు. డీవివీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందించ‌నున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా అనూ ఇమ్మాన్యుయేల్ .. కైరా అద్వాని పేర్లు వినిపిస్తున్నాయి.

1270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles