యూర‌ప్‌లో 25 రోజుల లాంగ్ షెడ్యూల్‌

Tue,September 4, 2018 10:41 AM
boyapati ram charan movie next schedule from today

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని భావించిన అభిమానుల‌కి నిరాశే ఎదురైంది. చిత్రంలో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, వివేక్‌ ఒబెరాయ్, ఆర్య‌న్ రాజేష్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ‌వంశ‌స్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. అయితే ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ యూరప్ - అజర్బైజాన్ లో 24 రోజుల పాటు ఏక‌ధాటిగా జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యం చిత్ర బృందం పోస్ట‌ర్ ద్వారా తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో షూటింగు జరుపుకుంటోన్న తొలి తెలుగు సినిమా ఇదే కావ‌డం విశేషం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో ఈ సినిమా విడుద‌ల కానుంది.

1336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles