మార్చి 31న బాక్సాఫీస్ బిగ్ ఫైట్

Sat,March 25, 2017 09:32 AM

ఉగాది పండుగకు ముందే కాటమరాయుడు చిత్రాన్ని రిలీజ్ చేసి అభిమానులకు పసందైన వినోదాన్ని అందించాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం పవన్ అభిమానులు ఆనందోత్సహాలలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్ర హవా మార్చి నెలాఖరు వరకు ఉండనుంది. ఇక మార్చి 31న బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరిగేలా కనిపిస్తుంది. విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రం కొన్నాళ్ళుగా రిలీజ్ డేట్ ని సస్పెన్స్ లో పెట్టి తాజాగా అఫీషియల్ డేట్ ప్రకటించింది. మార్చి 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక అదే రోజు డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తన దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలు ఫ్యాన్స్ ని అలరిస్తాయని భావిస్తున్నారు. ఇక వీటితో పాటు నయన తార నటించిన డోర, తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నామ్ షబానా చిత్రాలు కూడా డబ్బింగ్ జరుపుకొని తెలుగులో విడుదలయ్యేందుకు సిద్దమయ్యాయి. డోర మరియు నామ్ షబానా రెండు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కాగా ఈ ఇద్దరు హీరోయిన్స్ కి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో మార్చి 31 నాడు బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరిగేలా కనిపిస్తుంది.

1202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles