జూన్ 21న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బిగ్ ఫైట్

Wed,June 12, 2019 10:58 AM

మహేష్ బాబు న‌టించిన మహ‌ర్షి చిత్రం త‌ర్వాత మ‌రో పెద్ద సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌లేదు. ఆగ‌స్ట్ 15న ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ లోపు చిన్న‌, మ‌ధ్య స్థాయి సినిమాలు ప్రేక్ష‌కుల‌కి వినోదం అందించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. జూన్ 21న ఐదుకి పైగా సినిమాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే మల్లేశం, ఫస్ట్ ర్యాంక్ రాజు, కెప్టెన్ రాణా ప్రతాప్, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ,మంచు విష్ణు ‘ఓటర్’ జూన్ 21న‌ రిలీజ్ అయ్యేందుకు సిద్ద‌మ‌య్యాయి. మరి కొన్ని త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు కూడా అదే రోజు విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. మ‌రి దీనిని బ‌ట్టి చూస్తుంటే జూన్ 21న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బిగ్ ఫైట్ జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక జూన్ 14న విశ్వామిత్ర‌, వజ్ర కవచాదరా గోవిందా, గేమ్ ఓవర్‌, ఐ లవ్ యు (డబ్బింగ్) చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ఆ రోజు కూడా ప‌లు సినిమాల మ‌ధ్య ఆస‌క్తికర పోటీ ఉండ‌నుంది. మొత్తానికి జూన్‌లో సినిమాల సంద‌డి బాగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది.

2785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles