హోట‌ల్‌రూమ్‌లో శ్రీదేవి.. చివ‌రి క్ష‌ణాల్లో ఏం జ‌రిగింది?

Mon,February 26, 2018 07:12 AM
Bony Kapoor planned to give surprise dinner for Sridevi


ముంబై: పెళ్లికి వెళ్లిన శ్రీదేవి దుబాయ్‌లో జుమైరా ఎమిరేట్స్ హోట‌ల్‌లో ఉన్న‌ది. భ‌ర్త బోనీ క‌పూర్ శ‌నివారం మ‌ధ్యాహ్నం ఇండియా నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. శ్రీదేవిని అత‌ను స‌ర్‌ప్రైజ్ చేయాల‌నుకున్నాడు. ఆమెకు డిన్న‌ర్ పార్టీ ఇవ్వాల‌నుకున్నాడు. సాయంత్రం 5.30 ప్రాంతంలో బోనీ క‌పూర్ ... హోట‌ల్‌లో నిద్రిస్తున్న శ్రీదేవిని లేపాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ఓ 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఇక స‌ర్‌ప్రైజ్ పార్టీ కోసం త‌యార‌య్యేందుకు శ్రీదేవి వాష్‌రూమ్‌కు వెళ్లింది. కానీ 15 నిమిషాలు దాటినా ఆమె బ‌య‌ట‌కు రాలేదు. దీంతో బోనీ క‌పూర్ వాష్‌రూమ్‌కు వెళ్లాడు. ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం చేస్తే.. శ్రీదేవి స్పందించ‌లేదు. అనుమానంతో బోనీ క‌పూర్ త‌లుపుల‌ను గ‌ట్టిగా తీసి చూశాడు.

శ్రీదేవి వాష్‌రూమ్‌లో ఉన్న బాత్‌ట‌బ్‌లో చ‌ల‌నంలేని స్థితిలో ప‌డి ఉన్న‌ది. బాత్‌ట‌బ్ నిండా నీరు ఉన్న‌ది. శ్రీదేవి ఎంత‌కీ స్పందించ‌క‌పోవ‌డంతో బోనీ క‌పూర్ ఆమెను మేల్కొల్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా శ్రీదేవిలో స్పంద‌న రాలేదు. దాంతో బోనీ క‌పూర్ త‌న ఫ్రెండ్‌కు ఫోన్ చేశాడు. ఆ త‌ర్వాత సుమారు రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మాచారం అంద‌జేశారు. పోలీసులు, పారామెడిక్స్ హోట‌ల్‌కు చేరుకున్నారు. కానీ శ్రీదేవిలో క‌ద‌లిక లేక‌పోవ‌డంతో ఆమెను హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లారు. వారం క్రితం పెళ్లికి వెళ్లి తిరిగి ఇండియా వ‌చ్చిన బోనీ క‌పూర్‌.. శ‌నివారం శ్రీదేవిని స‌ర్‌ప్రైజ్ చేసేందుకు మ‌ళ్లీ వెళ్లాడు. కానీ డ్రీమ్ డిన్న‌ర్ అందుకోకుండానే సూప‌ర్‌స్టార్ క‌న్నుమూశారు.

13949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS