శ్రీదేవి బంగ్లాకు బోనీ క‌పూర్ నోటీసులు

Wed,January 16, 2019 12:06 PM

ముంబై: శ్రీదేవి బంగ్లా సినిమాకు ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ లీగ‌ల్ నోటీసులు జారీ చేశారు. ఇంట‌ర్నెట్ స్టార్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఆ ఫిల్మ్‌లో శ్రీదేవి పాత్రలో న‌టిస్తోంది. అయితే ఈ సినిమా టీజ‌ర్‌ను ఈమ‌ధ్యే రిలీజ్ చేశారు. ప్ర‌శాంత్ మంబుల్లే ఈ సినిమాను డైర‌క్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ శ్రీదేవి.. గత ఏడాది దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లో మృతిచెందిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీదేవి బంగ్లా టైటిల్‌తో వ‌చ్చిన సినిమా మ‌రో వివాదానికి కార‌ణ‌మైంది. ఆ సినిమాను శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బోనీ క‌పూర్ నుంచి లీగ‌ల్ నోటీసు అందింద‌ని, దాన్ని మేం స‌వాల్ చేస్తామ‌ని, ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో సినిమాను రూపొందించామ‌ని, శ్రీదేవి అనేది సాధార‌ణ పేరు మాత్ర‌మే అని డైర‌క్ట‌ర్ ప్ర‌శాంత్ వెల్ల‌డించారు. అయితే శ్రీదేవి బంగ్లా టీజ‌ర్‌లో హీరోయిన్ ఓ బాత్‌ట‌బ్‌లో ఉన్న సీన్ కొన్ని అనుమానాల‌కు తావిస్తోంది. దాంతో బోనీ క‌పూర్ ఆ సినిమాపై లీగ‌ల్ నోటీసుకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

4012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles