కంట‌త‌డి పెట్టిస్తున్న బోని క‌పూర్ లేఖ‌

Thu,March 1, 2018 10:48 AM
Boney Kapoor letter on Sridevi twitter

దివి నుండి భువికి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య అనంత‌లోకాల‌కి వెళ్లిపోయింది. ఆమె మ‌ర‌ణం కోట్లాది అభిమానులకి గుండెకోత‌ని మిగిల్చింది. అశ్రున‌య‌నాల మ‌ధ్య‌, బాధాత‌ప్త హృద‌యాల‌తో నిన్న సాయంత్రం శ్రీదేవికి తుది వీడ్కోలు ప‌లికారు. ఇంద్ర‌పురి రాకుమారి ఇక త‌మ మ‌ధ్య లేర‌ని తెలిసి కుటుంబ స‌భ్యులు ఎంతో ఆవేద‌నకి గుర‌వుతున్నారు. అంత్య‌క్రియ‌లు పూర్తైన త‌ర్వాత బోని క‌పూర్ రాసిన ఓ లెట‌ర్ ప్ర‌తి ఒక్క‌రికి కంట త‌డి పెట్టిస్తుంది. ఓ స్నేహితురాలిని, భార్య‌ని, త‌ల్లిని కోల్పోయిన ఇద్ద‌రు పిల్ల‌ల బాధ‌ని వ‌ర్ణించేందుకు మాట‌లు స‌రిపోవ‌డం లేదు. క్లిష్ట స‌మయంలో త‌న‌కి అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అని అన్నారు..

కుటుంబం, స్నేహితులు, కొలీగ్స్‌, వెల్ విష‌ర్స్‌, కుమారుడు అర్జున్‌, కుమార్తెలు అన్షులా, జాన్వి, ఖుషీల‌తో పాటు కోట్లాది అభిమానులు త‌న‌కి మ‌ద్ద‌తుగా నిలిచి ఎంతో ధైర్యాన్నిచ్చారని తీవ్ర ఉద్వేగానికి గుర‌య్యారు బోని. ప్ర‌పంచానికి శ్రీదేవి చాందిని. త‌న అభిమానుల‌కి అద్భుత న‌టి.. నాకు ప్రేమమూర్తి, స్నేహితురాలు, భాగ‌స్వామి, ఇద్ద‌రు పిల్ల‌ల‌కి త‌ల్లి. నా పిల్ల‌ల‌కి ఆమె స‌ర్వ‌స్వం. శ్రీదేవి జ్ఞాప‌కాలు చెరిగిపోయేవి కావు. వెండితెర ఉన్నంత వ‌ర‌కు అవి ప‌దిలంగానే ఉంటాయి. శ్రీదేవి లేకుండా ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఎలా ముందుకు వెళ్ళాల‌న్న‌దే నా స‌మ‌స్య‌. ఇది న‌న్ను చాలా ఆందోళ‌న‌కి గురి చేస్తుందని బోని లేఖ‌లో పేర్కొన్నారు.

అన్నీ తానై పిల్ల‌ల‌ని ముందుకు న‌డిపించింది శ్రీదేవి. ఆమె మా జీవితం. మా బ‌లం. ఈ న‌ష్టాన్ని ఎదుర్కోవ‌డానికి ఓ కుటంబంగా మేము క‌లిసి ప్ర‌య‌త్నిస్తున్నాం. శ్రీదేవి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధిస్తున్న‌ట్టు త‌న లేఖ‌లో తెలిపారు బోని. శ్రీదేవి మ‌ర‌ణంతో మేము ఎంతో ఆవేద‌న చెందుతున్నాం. మ‌న‌సారా ఆ దుఃఖాన్నిఅనుభ‌వించేందుకు కాస్త టైం ఇవ్వండ‌ని మీడియాకి విజ్ఞ‌ప్తి చేశారు. త‌ను రాసిన ఈ లేఖ‌ని బోని కపూర్ శ్రీదేవి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం విశేషం.


3994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles