అజిత్ నటనకి ఫిదా అయిన బోనీ కపూర్

Wed,April 10, 2019 10:54 AM
Boney Kapoor impress ahith action performance

తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజిత్. ఇటీవల విశ్వాసం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ప్రస్తుతం బోని క‌పూర్‌ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రం నెర్కొండ పార్వాయి చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించనున్నారు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో అజిత్ కోట్ వేసుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపించారు. అయితే చిత్ర నిర్మాత అయిన బోనీ కపూర్ తాజాగా చిత్ర రషెస్ చూసాడట. అజిత్ నటనకి నేను ఫిదా అయ్యాను. ఆయన త్వరలో మరికొన్ని హిందీ సినిమాలలో నటిస్తాడని అనుకుంటున్నాను. ప్రస్తుతం అజిత్ కోసం మూడు యాక్షన్ స్క్రిప్టులు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకదానికైనా అజిత్ ఓకే చెప్తాడని అనుకుంటున్నాను అంటూ బోనీ కపూర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ భార్య‌గా విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఈమెకి ఈ చిత్రం త‌మిళంలో తొలి మూవీ కాగా, రీసెంట్‌గా షూటింగ్ పూర్తైంది. గిబ్రాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు . అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు.



1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles