శ్రీదేవి ఫోటో చూసి క‌న్నీళ్ళు పెట్టుకున్న బోని

Fri,March 9, 2018 12:48 PM
Boney Kapoor CRIED After Receiving Tina Ambanis Gift

దివంగ‌త న‌టి శ్రీదేవి మ‌రణాన్ని ఆమె కుటుంబ స‌భ్యులే కాదు, అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి త‌న‌య‌లు, ఆమె భ‌ర్త బోని క‌పూర్‌ల‌కి శ్రీదేవి లేద‌నే విష‌యం ఏ మాత్రం మింగుడ‌ప‌డ‌డం లేదు. విషాదాన్ని దింగ‌మింగుకొని శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ రీసెంట్‌గా షూటింగ్‌లో పాల్గొంది. అయితే ప్ర‌ముఖ వ్యాపార వేత్త అనీల్ అంబానీ భార్య టీనా అంబానీ శ్రీదేవికి అత్యంత స‌న్నిహితురాలు . గ‌త నెల 11వ తేదీన టీనా త‌న‌ 61వ జ‌న్మ‌దిన వేడుక‌లని ముంబైలో గ్రాండ్‌గా జ‌రుపుకుంది. ఈ వేడుక‌ల‌కు శ్రీదేవి దంప‌తుల‌తో పాటు బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు స్టార్స్‌ని ఆహ్వానించింది టీనా. బ‌ర్త్‌డే కి హాజ‌రైన‌ శ్రీదేవి, బోనీ క‌పూర్ వేడుక‌లో సంద‌డి చేస్తూ, ఫోటోల‌కి ఫోజులిచ్చారు. శ్రీదేవితో క‌లిసి టీనా ప్ర‌త్యేకంగా ఓ ఫోటో తీయించుకుంది. బ‌ర్త్ వేడుక‌ల‌లో పాల్గొన్న 13 రోజుల త‌ర్వాత శ్రీదేవి కన్నుమూసింది. ఇది టీనాని ఎంత‌గానో బాధ‌పెట్టింది. శ్రీదేవితో తాను దిగిన ఫోటోకి వెండి ఫ్రేము చేయించి బోనికి గిఫ్ట్ గా ఇచ్చింద‌ట టీనా. ఇది చూసిన బోని క‌పూర్ క‌న్నీటి పర్యంత‌మ‌య్యాడ‌ని తెలుస్తుంది. అయితే శ్రీదేవితో క‌లిసి దిగిన ఫోటో ఇదే చివ‌రిది అవుతుంద‌ని అస్స‌లు అనుకోలేదంటూ టీనా కాస్త ఉద్వేగానికి లోన‌య్యారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయ్ నుండి ఇండియాకి తీసుకొచ్చేందుకు అంబానీ త‌న స్పెష‌ల్ చార్ట‌ర్డ్ ఫ్లైట్ దుబాయ్‌కి పంపిన విష‌యం తెలిసిందే.3703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles