తెలుగులో బ‌దాయు హో..రీమేక్ హ‌క్కుల‌ని ద‌క్కించుకున్న బోనీ క‌పూర్

Wed,March 20, 2019 08:53 AM
Boney Kapoor buys the remake rights of the blockbuster Badhaai Ho

శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్ నిర్మాత‌గా వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అజిత్ హీరోగా త‌మిళంలో పింక్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. జూన్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇక తాజాగా వినూత్నమైన కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌లో గ‌తఏడాది వచ్చిన ‘బదాయి హో’ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాడు బోనీ క‌పూర్‌. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా నాలుగు దక్షిణాది భాషల్లోనూ నిర్మించబోతున్నారు.

మనవళ్లు, మనువరాళ్లను ఎత్తుకునే వయస్సులో వృద్ధ జంట పిల్లల్ని కనడానికి రెడీ కావడం.. దానివల్ల పెళ్లై భార్యతో కాపురం చేసే కొడుకు ఇబ్బందులు పడుతుండటం లాంటి విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కించిన చిత్రం బ‌దాయి హో. థియేట‌ర్‌లో న‌వ్వులు పూయించిన ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్, క్రోమ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. స‌న్య మ‌ల్హోత్రా,అయిష్మాన్ ఖురానా, నీనా గుప్తా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని అమిత్ శ‌ర్మ తెర‌కెక్కించారు. ఇప్ప‌డు సౌత్‌లో ఈ చిత్రాన్ని అమిత్ శ‌ర్మ‌నే తెర‌కెక్కిస్తారా, లేదంటే వేరే ద‌ర్శ‌కుడు టేక‌ప్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles