బిగ్ బాస్ హౌజ్‌లో వాడివేడిగా జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌

Tue,September 11, 2018 09:04 AM
Bond Burning on Monday

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 చివ‌రి ద‌శ‌కు చేరుకోవడంతో ఇంట్లో స‌భ్యులు నువ్వా నేనా అంటూ పోటీ ప‌డుతున్నారు. గ‌త‌వారం బిగ్ బాస్ హౌజ్ నుండి శ్యామ‌ల ఎలిమినేట్ కావ‌డంతో ప్ర‌స్తుతం ఇంట్లో ఏడుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. 93వ ఎపిసోడ్‌లో గీతామాధురి, దీప్తిలు శ్యామ‌ల వెళ్ళిపోవ‌డం గురించి కొద్ది సేపు చ‌ర్చించుకున్నారు. ఆ త‌ర్వాత కౌశ‌ల్‌, దీప్తిల మ‌ధ్య కొద్ది సేపు డిస్క‌ష‌న్ జరిగింది. ఇప్ప‌టిలా మీరు ఇంత‌క‌ముందు ఉండి ఉంటే ఇలా జ‌రిగేదే కాదు అంటూ దీప్తి.. కౌశ‌ల్‌కి హితోప‌దేశం చేసింది. ఇక గీతా మాధురి చిలిపి చేష్టలతో కుక్క పిల్లలా మొరగాలి అని చెప్ప‌డంతో సామ్రాట్ కుక్కలా యాక్ట్ చేసాడు.

ఇక ఇంటి స‌భ్యుల‌కి స‌ర‌దాగా ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్‌. ఈ టాస్క్‌లో గెలిచిన టీంకి ఓ కాల‌ర్‌తో మాట్లాడే ఛాన్స్ ద‌క్కుతుంద‌ని చెప్ప‌డంతో ఇరు టీంలు గేమ్‌ని రంజుగా ఆడారు. ఈ టాస్క్ లో డ‌బ్బాల‌లో ఉన్న చార్జ‌ర్‌ని వెతికి, ఆ త‌ర్వాత ఐదు నిమిషాల పాటు చార్జింగ్ పెట్టాలి. మొబైల్ చార్జ్ అయిన త‌ర్వాత క్లారిటీగా డిఫ‌రెంట్ స్టైల్‌లో ఫోటోలు దిగాలి. ఈ స‌మ‌యంలో అవ‌త‌లి టీం వారు వీరిని డిస్ట‌ర్బ్ చేయోచ్చు. ఈ క్ర‌మంలో కౌశ‌ల్‌, త‌నీష్‌, సామ్రాట్‌, రోల్ రైడా క‌ల‌సి ఉన్న టీం ఫోటోలు క్లారిటీగా ఉండ‌డంతో బిగ్ బాస్ ఈ టాస్క్ విజేత‌లుగా వారిని ప్ర‌క‌టించారు. టాస్క్ లో గెలిచినందుకు వైజాగ్ నుండి శృతి అనే మ‌హిళ‌తో మాట్లాడే అవకాశం ఆ న‌లుగురికి ద‌క్కింది. శృతి .. రోల్ ఫ్యాన్ కావ‌డంతో అత‌డితోనే ఎక్కువ సేపు ముచ్చ‌టించింది.

ఇక సోమ‌వారం నాడు ఎలిమినేష‌న్ కోసం జరిగే నామినేష‌న్ ప్ర‌క్రియ కోసం బిగ్ బాస్, తాము ఏ ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌ని అయితే ఎలిమినేట్ చేయాల‌నుకుంటున్నారో వారు, ఆ ఇద్దరి ఫోటోలను తీసుకుని ఎదురుగా ఉన్న మంటలో వేసి, అందుకు గల కారణాలను వివరించాలన్నారు. కౌశ‌ల్ సీజ‌న్ మొత్తం నామినేట్ అయిన కార‌ణంగా అత‌నిని ఎవ‌రు నామినేట్ చేయోద్ద‌ని బిగ్ బాస్ సూచించారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా రోల్ రైడా.. దీప్తి నల్లమోతు, గీతా మాధురిలను ఎలిమినేషన్‌‌కి నామినేట్ చేసాడు.‘టిక్కెట్ టు ఫినాలేలో ఎలాంటి పోటీ చూపించ‌ని కార‌ణంగా వారిద్దరిని నామినేట్ చేస్తున్న‌ట్టు రోల్ తెలిపాడు.

అమిత్.. దీప్తి నల్లమోతు, గీతా మాధురిలను ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తూ.. రోల్ రైడా అభిప్రాయాన్నే తానూ చెప్పొకొచ్చారు. టిక్కెట్ టు ఫినాలే అవ‌కాశం దొరికినప్పుడు, మీరు ఇంకొంచెం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే బాగుండేది అన్నారు.

సామ్రాట్.. దీప్తి నల్లమోతు, అమిత్‌లను నామినేట్ చేస్తూ.. టిక్కెట్ టు ఫినాలేలో మీరు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు. ఇంత‌వ‌ర‌కు నేను నామినేట్ కాలేద‌ని నన్ను నామినేట్ చేయ‌డం న‌చ్చ‌లేదు. శ‌నివారం చెప్పిన కార‌ణం నాకు న‌చ్చ‌లేదు. టిక్కెట్ కోసం మీరు పోరాటం చేయ‌ని కార‌ణంగా అమిత్‌ని నామినేట్ చేస్తున్నాన‌ని సామ్రాట్ అన్నాడు.

కౌశల్.. తనీష్‌ను నామినేట్ చేస్తూ.. దీప్తిని అమ్మా అమ్మా అంటూ ఫిజిక‌ల్ టాస్క్ ఆడ‌డం న‌చ్చ‌లేదు. అమ్మ‌ని కాకుండా అక్క లేదా చెల్లి అని చెప్పి గేమ్ ఆడితే చూడ‌డానికి బాగుండేదేమో! త‌ర్వాతి స‌మ‌యంలో బాండింగ్ లేకుండా ఆడితే బాగుంటుందేమో. మీ ఒపీనియన్ కూడా సరిగా ఉండటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నాన్నారు కౌశ‌ల్‌. ఇక గీతా మాధురిని నామినేట్ చేస్తూ.. పర్స‌నాలిటికీ, మెచ్యూరిటీ లెవ‌ల్‌కి సంబంధం ఉండ‌డం లేదు. రూల్స్ త‌ప్పుతూ వేరే వారిని గారం చేస్తూ వారి గేమ్ వారిని ఆడుకోనివ్వ‌డం లేద‌ని అనిపిస్తుంది. ఈ కార‌ణంగా గీతాని నామినేట్ చేస్తున్నాన‌ని కౌశ‌ల్ పేర్కొన్నాడు .

గీతా మాధురి.. అమిత్, రోల్ రైడాలను నామినేట్ చేస్తూ.. మీ రీజ‌న్స్ ఏమి నేను మ‌న‌సులో పెట్టుకోను. నన్ను నామినేట్ చేసినందుకే మీ ఇద్దర్నీ నామినేట్ చేస్తున్నానన్నారు.

తనీష్.. దీప్తిని నామినేట్ చేస్తూ నేను కారులో నుండి మిమ్మల్ని తోయడం చూసేవాళ్లకు సరిగా అనిపించలేదని కౌశల్, నాని అన్న అన్నారు. కాని చూసేవాళ్లకు ఏమైనా అర్ధం చేసుకోవచ్చు. కాని అక్కడ మీరు నేను ఉన్నాం. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు కాని మీరు నోరు విప్పి మాట్లాడలేదు. అది బాధ కలిగించింది. అందుకే మిమ్మిల్ని నామినేట్ చేస్తున్నా అన్నారు. ఇక మరో కంటెస్టెంట్‌గా అమిత్‌ను నామినేట్ చేశారు. వాళ్లు ఎఫెర్ట్ పెట్టలేదని మీరు నామినేట్ చేశారు .అది మీకు కూడా వర్తిస్తుందన్నారు. అందుకే నామినేట్ చేస్తున్నానన్నారు.

అయితే దీప్తిని నామినేష‌న్ చేసిన కార‌ణంగా త‌నీష్‌ని కౌశ‌ల్ ఓ ప్రశ్న వేశాడు. అమ్మ అమ్మ అని అంటూ కిందా మీదా పడేసి.. మీరు వేరే రిలేషన్స్‌కి విలువనిచ్చి అమ్మ రిలేషన్‌కి ఎందుకు విలువనివ్వలేదన్నారు కౌశల్. నేను ఒక‌రిని అమ్మ అని పిలిస్తే వారి కోసం కెప్టెన్సీ వ‌దులుకునేవాడిని. సునయనతో మీరు ఉన్న బాండింగ్ , అమ్మ అని దీప్తితో ఉన్న బాండింగ్ తేడాగా ఉంద‌ని కౌశ‌ల్ అన్నాడు. దీంతో త‌నీష్‌.. నేను ముందుగానే దీప్తితో చెప్పాను. టాస్క్ విష‌యంలో మాత్రం బంధాల‌ని ప‌ట్టించుకోను అని. ఆమెకి లేని బాధ మీకేందుకు అంటూ త‌నీష్‌, కౌశ‌ల్‌లు కొద్ది సేపు వాదోప‌వాదాలు జ‌రుపుకున్నారు.

దీప్తి నల్లమోతు.. అమిత్‌ను నామినేట్ చేస్తూ నేను ఎఫర్ట్ పెట్టలేదని నామినేట్ చేశారని అదే రీజన్‌తో ఆయన్ని నామినేట్ చేస్తున్నానన్నారు. తరువాత రోల్ రైడాని నామినేట్ చేశారు. మొత్తానికి ఈ వారం నామినేష‌న్స్ లో కౌశ‌ల్‌తో పాటు దీప్తి నల్లమోతు, గీతా మాధురి, అమిత్, రోల్ రైడాలు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

5535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles