హీరోకి గాయం .. నిలిచిపోయిన ‘జేమ్స్‌ బాండ్‌’ 25వ చిత్రం

Wed,May 15, 2019 12:11 PM

డేనియ‌ల్ క్రెయిగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘జేమ్స్‌ బాండ్‌’ 25వ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. కేరీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం జ‌మైకాలో జ‌రుగుతుంది. అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే 25వ మూవీ చిత్ర‌ కథ ఉండబోతోందని స‌మాచారం. అయితే సీన్‌లో భాగంగా సెట్‌లో ప‌రుగెత్తుతున్న‌ప్పుడు డేనియ‌ల్ కాలు మ‌డత‌ప‌డి కింద ప‌డిపోయాడ‌ట‌. ఆయ‌న చీల‌మండ‌కి గాయం కావ‌డంతో వెంట‌నే అమెరికాలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారట‌. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించ‌డంతో ఈ మూవీ కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది.


లండ‌న్‌లోని ప్ర‌తిష్టాత్మ‌క పైన్‌వుడ్ స్టూడియోస్‌లో జ‌ర‌గాల్సిన షెడ్యూల్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డిన‌ట్టు స‌మాచారం. నార్వే, ఇట‌లీలోను చిత్రానికి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ జ‌ర‌ప‌నున్నారు. గ‌తంలో నాలుగుసార్లు జేమ్స్‌బాండ్ పాత్ర పోషించిన క్రేగ్ ఐదో సారి జేమ్స్ బాండ్‌గా క‌నిపించ‌నున్నాడు. 25వ బాండ్ మూవీ 2019 న‌వంబ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ది. త‌న‌కి స్పైగా అదే చివ‌రి మూవీ అవుతుంద‌ని క్రెయిగ్ ఆ మ‌ధ్య వెల్ల‌డించాడు. పియ‌ర్స్ బ్రాస్న‌న్ త‌ర్వాత క్రేగ్ బాండ్ పాత్ర పోషిస్తున్నాడు. కాసినో రాయ‌ల్‌, క్వాంట‌మ్ ఆఫ్ సొలేస్‌, స్కైఫాల్‌, స్పెక్ట‌ర్ చిత్రాల్లో డేనియ‌ల్ న‌టించాడు. గ‌తంలోను చాలా సార్లు క్రెయిగ్ గాయాల బార ప‌డిన త్వ‌ర‌గానే కోలుకొని షూటింగ్ పూర్తి చేశాడు.

1327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles