ఇస్మార్ట్ శంక‌ర్ నుండి 'బోనాలు' వీడియో సాంగ్ విడుద‌ల‌

Wed,October 2, 2019 09:06 AM

హీరో రామ్‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన‌ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. జూలై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్ష‌కులకి మంచి వినోదాన్ని అందించింది. పూరీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సెప్టెంబ‌ర్ 27,28,29 తేదీల‌లో చిత్రాన్ని ప‌ది థియేట‌ర్స్‌లో రీ రిలీజ్ చేశారు. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన వీడియో విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు మేక‌ర్స్. తాజాగా బోనాలు అనే చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో రామ్ స్టెప్స్ యూత్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. మీరు ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరో స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మించారు.

1112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles