‘కేదార్‌నాథ్’ విడుదలను నిలిపివేయాలని పిటిషన్

Wed,December 5, 2018 05:36 PM
Bombay HC to Hear plea on kedarnath movie petition

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కేదార్‌నాథ్. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమాకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా విడుదలను నిలిపేయాలని కొంతమంది పిటిషనర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మతపరమైన భావోద్వేగాలను కించపరిచే విధంగా ఉందని..ఈ చిత్రాన్ని పున: పరిశీలించాలని పిటిషనర్లు సీబీఎఫ్‌సీని కోరారు. ఈ నేపథ్యంలో సీబీఎఫ్‌సీ నుంచి తదుపరి క్లియరెన్స్ వచ్చే వరకు సినిమా విడుదలను నిలిపేయాలని కోర్టును పిటిషనర్లు కోరారు. పిటిషన్‌పై రేపు బాంబే హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని, విడుదలను నిలిపివేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

1924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles