సెన్సార్ వద్దు.. సర్టిఫికెట్ ఇవ్వండి

Fri,June 10, 2016 02:17 PM
Bombay HC to CBFC: Your Job Is to Certify Films Not Censor Them

ముంబై : సెన్సార్ బోర్డుపై ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉడ్తా పంజాబ్ మూవీలో 89 సీన్లకు కట్ చెప్పిన సెన్సార్ బోర్డును కోర్టు తీవ్రంగా మందలించింది. సెన్సార్ బోర్డు కేవలం సినిమాలకు సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి, వాటిని సెన్సార్ చేసే అధికారం బోర్డుకు లేదని ఆ కేసు విచారణ సందర్భంగా హై కోర్టు అభిప్రాయపడింది.

సెన్సార్ బోర్డు ఇష్టమొచ్చినట్లు ఉడ్తా పంజాబ్ సినిమాలో కట్టింగ్ చేయడంతో బాలీవుడ్ డైరక్టర్ల సంఘం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సినిమాలో మాదకద్రవ్యాల అంశాన్ని అతిగా చూపిస్తున్నారని అనుకున్నప్పుడు, ఆ ఫిల్మ్ ను ఎందుకు పూర్తిగా నిషేధించలేదని సెన్సార్ బోర్డును కోర్టు ప్రశ్నించింది. టీవీ కార్యక్రమాలైనా, సినిమా అయినా ఓ రాష్ట్రాన్ని కించపరిచేవిధంగా చూపిస్తున్నారని అనిపిస్తే, ఆ అంశాన్ని ప్రజలకే వదిలేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఉడ్తా పంజాబ్ చిత్రంలో ఉన్న బూతు పదాలు, సీన్లను తొలిగించాలని సెన్సార్ బోర్డు కోర్టు విచారణ సందర్భంగా కోరింది. ఆ ఫిల్మ్ లో ఓ శునకానికి జాకీ చాన్ పేరు పెట్టారని, ఇది వివాదాస్పదమవుతోందని సెన్సార్ బోర్డు వాదించింది. అందుకే ఆ సీన్ ను కట్ చేసినట్లు బోర్డు కోర్టుకు విన్నవించింది.

షాహిద్ కపూర్ నటిస్తున్న ఉడ్తా పంజాబ్ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. ఓ సాంగ్ లో హీరో షాహిద్ కపూర్ పబ్లిక్ ముందు మూత్రం పోస్తున్నట్లు ఉన్న సీన్ ను కట్ చేసేందుకు నిర్మాతలు అంగీకరించారు. ఉడ్తా పంజాబ్ ఫిల్మ్ కోసం సెన్సార్ బోర్డు పై వేసిన కేసు పట్ల ముంబై హైకోర్టు సోమవారం తుది తీర్పును వెల్లడించనుంది.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles