మణికర్ణిక విడుదలకు బాంబే హైకోర్టు అనుమతి

Thu,January 24, 2019 05:04 PM
bombay HC clearance to Manikarnika Movie release

ముంబై : బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటించిన మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం విడుదలకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సన్నివేశాలు వక్రీకరించి చూపారని హిందూ కర్ణిసేన కార్యకర్తలు చేసిన ఆరోపణలపై హైకోర్టు వివరణ కోరింది. ఆరోపణలపై మణికర్ణిక చిత్రయూనిట్ రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మణికర్ణిక చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మణికర్ణిక రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


మణికర్ణిక ట్రైలర్..1005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles