చెర్రీ హెయిర్ స్టైల్ కోసం బాలీవుడ్ స్టైలిస్ట్

Sun,November 18, 2018 07:04 AM
Bollywood Stylist Roped  For Ram Charan rrr

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి అతి త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొంద‌నున్న ఆర్ఆర్ఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా ఇద్ద‌రు హీరోలు త‌మ మేకోవ‌ర్‌పై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్‌ని స‌రికొత్త లుక్‌లో చూపించేందుకు ప్ర‌ముఖ హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ కృషి చేస్తుండ‌గా, చెర్రీకి స‌రికొత్త హెయిర్‌ స్టైల్ సెట్ చేసేందుకు ప్ర‌ముఖ బాలీవుడ్ స్టైలిస్ట్ ఆలిమ్ హ‌కీమ్ టీంతో క‌లిసారు. రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళితో క‌లిసి దిగిన ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన హ‌కీమ్.. రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ని క‌ల‌వ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపారు. 15 ఏళ్ళ క్రితం సై మూవీ కోసం రాజ‌మౌళిని క‌లిసిన నేను మ‌ళ్లీ ఇన్నేళ్ళ త‌ర్వాత క‌లిసాను.. ర‌గ్బీ గేమ్ కోసం నితిన్‌ని స‌రికొత్త లుక్‌లో చూపించేందుకు 2004లో హ‌కీమ్ హైద‌రాబాద్‌కి వ‌చ్చాను. రాజ‌మౌళి గారు త‌న ప్ర‌తి సినిమాలో ఎదో కొత్త ద‌నం చూపించేందుకు తాపత్ర‌య‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ని వ‌రుస విజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. అత‌ను భార‌తీయ సినిమాకి గొప్ప‌వారం. రాజ‌మౌళి ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంద‌ని ఆలిమ్ హ‌కీమ్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇటీవ‌ల అధికారికంగా లాంచ్ కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్‌పైకి తీసుకెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారు.1398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles