గ‌ణేశ్ ఆర్తిలో పాల్గొన్న సంజ‌య్ ద‌త్ ఫ్యామిలీ

Thu,August 24, 2017 12:47 PM
Bollywood star Sanjay Dutt and his family participated in Ganesh Aarti in Mumbai

బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ ఫ్యామిలీ గ‌ణేశ్ ఆర్తిలో పాల్గొన్నారు. ముంబైలోని లోఖండ్ వాలా ద‌గ్గ‌ర ఉన్న గ‌ణ్ప‌తి పండ‌ల్ ను వాళ్లు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా జ‌ర‌గిన గ‌ణేశ్ ఆర్తిలో వాళ్లు పాల్గొన్నారు. సంజ‌య్ వైఫ్.. మాన్య‌త సాంప్ర‌దాయంగా చీర క‌ట్టుకోగా... సంజ‌య్ కుర్తా పైజామా ధ‌రించి గ‌ణేశ్ ఆర్తిలో పాల్గొన్నారు. గ‌ణేశ్ ఉత్స‌వాల‌ను త‌మ ఇంట్లో సెల‌బ్రేట్ చేస్తామ‌ని... వినాయ‌కుడిని తాము ఎంతో పూజిస్తామ‌ని సంజయ్ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

ఇక‌..జైలు జీవితం నుంచి బ‌య‌టికి వ‌చ్చాక‌.. సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న మూవీ భూమి. ఈ మూవీలో సంజ‌య్ గ‌ణ‌ప‌తి బప్పా మీద ఓ పాట కూడా పాడాడు. సెప్టెంబ‌ర్ 22 న రిలీజ్ అవ‌నున్న ఈ మూవీ కి ఓముంగ్ కుమార్ డైరెక్ట‌ర్. తండ్రీ కూతురు మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌తికార డ్రామా కు రూపమే ఈ సినిమా అంటూ మూవీ యూనిట్ తెలియ‌జేసింది. ఇక‌... సంజ‌య్ ద‌త్ కూతురుగా అదితి రావ్ హైద‌రీ న‌టిస్తున్న‌ది.

1027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS