ఆస్ట్రేలియాలో మ‌న జాతీయ జెండాను ఎగ‌రేసిన ఐష్, ఆరాధ్య‌

Sat,August 12, 2017 04:39 PM
Bollywood Star Aishwarya Bachchan Hoisted our National flag at IFFM 2017

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎమ్) 2017 కు బాలీవుడ్ సుంద‌రి ఐశ్వ‌ర్యా బ‌చ్చ‌న్, త‌న గారాల ప‌ట్టి ఆరాధ్య హాజ‌ర‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా 70 వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఐష్ మ‌న జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఆమె వెంట త‌న కూతురు ఆరాధ్య కూడా ఉంది. గురువారం రాత్రి మెల్ బోర్న్ కు ఐష్ త‌న కూత‌రుతో క‌లిసి ప‌య‌న‌మైన సంగ‌తి తెలిసిందే. వాళ్ల‌కు సెండ్ ఆఫ్ ఇవ్వ‌డానికి ఐష్ భ‌ర్త అభిషేక్ ముంబ‌యి ఎయిర్ పోర్టు కు వ‌చ్చాడు.

శుక్ర‌వారం రాత్రి వేడుక‌ల్లో భాగంగా బ్లాక్ ఎంబ్రాయిడ‌రీ డ్రెస్ వేసుకున్న ఐష్ రెడ్ కార్పెట్ పై న‌డిచి అందిరి మ‌న‌స్సుల‌ను దోచేసింది. ఇక‌.. ఐష్ ను ఐఐఎఫ్ఎమ్ ఎక్సలెన్స్ కింద‌ గ్లోబ‌ల్ సినిమా అవార్డు వ‌రించింది. అవార్డు అందుకున్న ఐష్ ..."ఈ అవార్డు అందుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మ‌న‌లాంటి సృజ‌నాత్మ‌క వ్య‌క్తులు ఎప్పుడూ ఎదో ఒక‌టి చేయ‌డానికే ప‌రిత‌పిస్తుంటారు. రెస్ట్ కు నేను వ్య‌తిరేకిని. ఒక న‌టిగా ఇంకా ఎంతో నేను చేయాల్సి ఉంది. ఈ అవార్డు రావ‌డం ఎంతో గౌర‌వంగా ఫీల్ అవుతున్నా. న‌న్ను ఆద‌రిస్తున్న నా అభిమానులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. మీ వ‌ల్ల‌నే మా క‌లలను సాకారం చేసుకుంటున్నాం" అని తెలిపింది.
2563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles