బాలీవుడ్ అర్జున్ రెడ్డి మూవీ టైటిల్ ఫిక్స్

Fri,October 26, 2018 11:06 AM
bollywood remeake movie title fixed

సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. ఈ చిత్రం తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో విక్రమ్ తనయుడు హీరోగా నటిస్తోండగా ఈ చిత్రానికి వ‌ర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసి త్వ‌ర‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు . ఇక హిందీ రీమేక్‌లో షాహిద్‌కపూర్ నటిస్తున్నాడు. ఆయ‌న‌కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ న‌టిస్తుంది. తెలుగు వ‌ర్షెన్ తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసి తాజాగా ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో పిడికిలి గుర్తు క‌నిపిస్తుండ‌గా, దీనిపై అభిమానులు ప‌లు చ‌ర్చ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది జూన్ 21న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. తొలి సినిమాతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డికి రెండో సినిమాగా బాలీవుడ్ చిత్రం రావ‌డం అదృష్ట‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి తెలుగు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి సందీప్ రెడ్డి ఎలాంటి విజ‌యం సాధిస్తాడో చూడాలి.

2013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles