సంజ‌య్ ద‌త్ ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌స్థానం రీమేక్

Tue,May 22, 2018 12:50 PM
Bollywood Remake Of Telugu Film Prasthanam goes on floors soon

శర్వానంద్‌ హీరోగా 2010లో వ‌చ్చిన ‘ప్రస్థానం’ చిత్రం మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ దేవాకట్ట పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శర్వానంద్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ప్రస్థానం. ఈ మూవీ గ్రామాల‌తో పాటు దేశంలో రాజ‌కీయాల‌ని డిఫ‌రెంట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీ హిందీ రీమేక్ లో కానుందని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. అయితే ఈ మూవీపై పూర్తి క్లారిటీ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఇచ్చాడు. సంజ‌య్ ద‌త్ ప్రొడ‌క్ష‌న్‌లో ప్ర‌స్థానం హిందీ రీమేక్ రూపొంద‌నుండ‌గా, ఇందులో సంజ‌య్ ద‌త్‌, అమైరా ద‌స్తూర్‌, అలీ ఫాజ‌ల్ ప్ర‌ధాన పాత్రలు పోషించ‌నున్నారని అన్నారు. సంజ‌య్ ద‌త్ త‌ల్లి న‌ర్గీస్ ద‌త్ బ‌ర్త్ యానివ‌ర్స‌రీ (జూన్ 1) సంద‌ర్బంగా మూవీ షూటింగ్ ప్రారంభించాల‌ని టీం భావించింద‌ని త‌ర‌ణ్ తెలియ‌జేశాడు. ఈ రీమేక్ చిత్రాన్ని కూడా దేవా క‌ట్ట‌నే తెర‌కెక్కించ‌నున్నాడు. రీమేక్‌లో సాయికుమార్ పాత్ర‌ని సంజయ్ దత్, శ‌ర్వానంద్ పాత్రని అలీ ఫాజ‌ల్‌ పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం.


1207
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS