వీరి ప్రేమ సాక్ష్యం ఇదేనా..?

Sat,July 29, 2017 01:30 PM
Bollywood celebrities give clarity about their love

మహేష్‌ తో వన్ నేనొక్కడినే చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ కృతి సనన్. ఈ అమ్మడు కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. అందుకు కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం ఒకటైతే, సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్ లు మరో కారణం అని చెప్పవచ్చు. అయితే కొంత కాలంగా కృతి – సుశాంత్ లు ప్రేమించుకుంటున్నారని బాలీవుడ్ మీడియా కోడూ కూస్తున్న ఈ వార్తలని వారు కొట్టి పారేశారు. కాని తాజాగా జరిగిన ఓ పార్టీ వీరి మధ్య ప్రేమ ఉందని బలంగా చెబుతుందట

కృతి సనన్ తన 27 వ బర్త్ డే ని జూలై 27న సుశాంత్ ఇంటిలో జరుపుకుందట. ఈ యంగ్ హీరో తన ఇంటికి బరేలీ కి బర్ఫీ టీం ని పిలిచి వారి మధ్య కృతి సనన్ బర్త్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించాడట. ఆ తర్వాత కృతి, ఆమె చెల్లెలు నూపుర్ సనోన్ తో కలిసి పేరున్న హోటల్ కి డిన్నర్ కి వెళ్ళాడట. ఈ వ్యవహారాన్ని అంతా చూసిన బాలీవుడ్ మీడియా వీరిద్దరి మధ్య పక్కా ప్రేమ ఉందని కన్ ఫాం చేస్తున్నారు. మరి ఇప్పటికైన ఈ ఇద్దరిలో ఎవరో ఒకరైన ఓపెన్ అవుతారో లేదో చూడాలి.

3652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles