ఈ హీరోయిన్ తింటున్న బంగారు ఐస్‌క్రీమ్ ఖరీదెంతో తెలుసా?

Tue,November 13, 2018 01:24 PM
Bollywood beauty Shilpa Shetty enjoyed Gold plated Ice Cream in Hong Kong

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాంకాంగ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తన హాలీడే ఫొటోలను 77 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. అలా ఈ మధ్యే మరో వీడియోను ఈ పొడుగు కాళ్ల సుందరి పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోలో శిల్పా 24 క్యారెట్ల బంగారం పూత పూసిన ఓ వెనీలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను తింటూ కనిపించింది. హాంకాంగ్‌లోని సోగో ఐ క్రిమీరియా అనే స్టోర్‌లో ఈ ఐస్‌క్రీమ్ దొరుకుతుంది. దీని ధర ఎంతో తెలుసా.. 13 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.948 మాత్రమే. మీరూ ఈ లగ్జరీ డెజర్ట్‌ను ట్రై చేయాలని అనుకుంటే హాంకాంగ్‌లోని ఆ రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ప్లేటెల్ డెజర్ట్స్‌కు ఈ మధ్య విపరీతమైన డిమాండ్ ఉంటున్నది. డోనట్స్, చాకొలేట్స్‌లాంటి వాటిపై బంగారం పూత పూసి తింటున్నారు. శరీర మెటబాలిజానికి స్వచ్ఛమైన బంగారం మేలు చేస్తుంది. శరీర పీహెచ్ స్థాయిని ఇది సమం చేస్తుంది.

5648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles