అచ్చం అదే గెట‌ప్‌లో బాలీవుడ్ అర్జున్ రెడ్డి

Thu,November 22, 2018 10:44 AM
bollywood arjun reddy look goes viral

టాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అర్జున్ రెడ్డి చిత్రం ప్ర‌స్తుతం తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో విక్రమ్ తనయుడు హీరోగా నటిస్తోండగా ఈ చిత్రానికి వ‌ర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసి త్వ‌ర‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు . ఇక హిందీ రీమేక్‌లో షాహిద్‌కపూర్ నటిస్తున్నాడు. ఆయ‌న‌కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ న‌టిస్తుంది. తెలుగు వ‌ర్షెన్ తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వ‌చ్చే ఏడాది జూన్ 21న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే హిందీ వ‌ర్షెన్‌కి సంబంధించిన మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, తాజాగా షాహిద్ క‌పూర్ అభిమాని లొకేష‌న్ పిక్ లీక్ చేశారు. ఇందులో షాహిద్ భారీ గ‌డ్డంతో ,చొక్కా లేకుండా తెలుగు అర్జున్ రెడ్డి ని త‌ల‌పిస్తున్నాడు. భారీ కండ‌ల‌తో ఉండే షాహిద్ ఈ సినిమా కోసం త‌న కండ‌ల‌ని కాస్త త‌గ్గించుకున్న‌ట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా బాలీవుడ్‌లోను రికార్డ్స్ బ్రేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు.

2940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles