కృతిసనన్ కంటే కాలేజి గాళ్స్ అందంగా ఉంటారు: నటి

Thu,July 27, 2017 01:54 PM

సినీరంగంలో చాలామంది నటీనటులు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎలాంటి ఈర్ష్య కానీ అసూయ వారికి ఉండవు. కానీ కొంతమంది హీరోలకు లేదా హీరోయిన్లకు మాత్రం ఒక విధమైన ఇగో ఉంటుంది. తానే గొప్ప అనే అహం ఉంటుంది. తనకంటే ఎవరైనా కాస్త హై లెవెల్ లో ఉంటే చూడలేరు. వాళ్లను కించపరుస్తూ ఏదోక కామెంట్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ హీరోయిన్ పై చేసిన‌ కామెంట్స్ ఇటీవల కొంత వివాదానికి, విమర్శలకు దారితీశాయి.


మహేష్ బాబుకు జోడీగా 'వన్ నేనొక్కడినే' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన నటి కృతి సన‌న్ ఈ మధ్య ఓ చిన్న గిమ్మిక్ చేసింది. ఓసారి తెల్లవారు జామునే లేచి తన బెడ్ పై ఆనందంతో డాన్స్ చేసింది. ఆ డాన్స్ ను వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది. దీనిపై బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ కామెంట్ చేశాడు. 'రాబ్తా' సినిమా ఫ్లాప్ కావడంతో 'కృతి సనన్ కి పిచ్చెక్కిందని, అందుకే ఇలా డాన్స్ చేస్తోందం'టూ ఆమె పోస్టు చేసిన వీడియోను రీ ట్వీట్ చేశాడు.

దీనిపై మరో బాలీవుడ్ వర్థమాన నటి భైరవి రియాక్ట్ అయింది. కృతిపై విచిత్రమైన వ్యాఖ్య చేసింది. 'కృతి సనోన్ ఎలా హీరోయిన్ అయిందో అర్థం కావడం లేదు. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ కూడా లేదు, చాలా మంది కాలేజీ యువతులు కృతి ససాన్ కంటే అందంగా ఉంటారు' అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఇవి బాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. ఒక నటిని మరో నటి ఈస్థాయిలో విమర్శలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు

3644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles