చెక్ బౌన్స్ కేసులో కమెడియన్‌కు ఆరు నెలల జైలు

Mon,April 23, 2018 04:02 PM
Bollywood actor Rajpal Yadav gets 6 months jail in Cheque bounce case

బాలీవుడ్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్‌కు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీలోని కర్కర్‌డూమా కోర్టు రాజ్‌పాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. రాజ్‌పాల్‌పై మొత్తం ఏడు కేసులు ఉన్నాయి. ఒక్కో కేసులో రూ.1.6 కోట్ల జరిమానా కట్టాలని కూడా రాజ్‌పాల్‌ను కోర్టు ఆదేశించింది. రూ.5 కోట్ల రుణాన్ని తిరిగి తీర్చలేని కేసులో రాజ్‌పాల్‌తోపాటు అతని భార్య రాధా యాదవ్, వాళ్ల కంపెనీ మెసర్స్ శ్రీ నౌరంగ్ గోదావరి ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోర్టు దోషులుగా తేల్చింది. అతను దర్శకత్వం వహించిన తొలి సినిమా అతా పతా లాపతా సినిమా ఘోరంగా ఫ్లాపవడంతో అందులో పెట్టుబడి పెట్టిన ఓ ఇన్వెస్టర్‌కు ఆ మొత్తం ఇవ్వలేకపోయాడు. ఇదే కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశాడన్న కారణంగా 2013 ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు రాజ్‌పాల్‌ను తీహార్ జైలుకు పంపించారు. ఈ నెల 14న చెక్ బౌన్స్ కేసులో రాజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది.

3759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles