టాప్ హీరోపై చీటింగ్ కేసు నమోదు!

Tue,August 28, 2018 04:42 PM
Bollywood actor Hrithik Roshan booked under Cheating case

బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్‌తోపాటు మరో ఎనిమిది మందిపై చెన్నైలో కేసు నమోదైంది. మురళీధరన్ అనే ఓ స్టాకిస్ట్ ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారు. గుర్గావ్‌కు చెందిన ఓ సంస్థ హృతిక్ రోషన్‌కు చెందిన హెచ్‌ఆర్‌ఎక్స్ బ్రాండ్ ఉత్పత్తులను మర్చండైజ్ చేయడానికి తనను స్టాకిస్ట్‌గా నియమించుకుందని, అయితే హృతిక్‌తోపాటు మరికొందరు తనను రూ.21 లక్షలు ముంచారని మురళీధరన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదరు గుర్గావ్ సంస్థ ఉత్పత్తులను సరిగా సరఫరా చేయలేదని, తనకు తెలియకుండా మార్కెటింగ్ టీమ్‌ను కూడా తొలగించిందని అతడు ఆరోపించాడు. దీనివల్ల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని, ఉన్న ఉత్పత్తులను తిప్పి పంపితే.. వాటికి చెల్లించాల్సిన మొత్తం కూడా తనకు ఇవ్వలేదని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు హృతిక్ రోషన్‌తోపాటు మరో ఎనిమిది మందిపై కొడంగయ్యూర్ పోలీసులు సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు.

5227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles