గ‌ర్ల్ ఫ్రెండ్‌ని వేధించిన కార‌ణంగా కోహ్లీ అరెస్ట్

Wed,June 13, 2018 12:01 PM
Bollywood actor Armaan Kohli arrested for assaulting girl friend

బాలీవుడ్ న‌టుడు అర్మాన్ కోహ్లీ త‌న ప్రేయ‌సిని శారీరికంగా వేధించాడ‌నే కార‌ణంతో ముంబైలోని శాంటాక్రూజ్ పోలీసులు ఆయ‌న‌పై 302,326,504,506 సెక్ష‌న్స్ కింద కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. అర్మాన్ త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌తో 2015 నుండి రిలేష‌న్‌లో ఉన్నాడు. స‌న్నిహిత వ్య‌క్తి ద్వారా వీరిద్ద‌రు ఏకం కాగా, గ‌త మూడు సంవ‌త్స‌రాల నుండి డేటింగ్‌లో ఉన్నారు. కాని ఈ మ‌ధ్య ఆర్ధిక సంబంధ‌మైన విష‌యాల‌లో గొడ‌వలు రావ‌డంతో వీరి వ్య‌వ‌హారం పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లింది.

జూన్ 3న అర్మాన్ కోహ్లీ త‌న ప్రేయ‌సి స్టైలిస్ట్ నీరూతో గొడ‌ప‌డ్డాడు. ఈ గొడ‌వ చిలికి చిలికి తారా స్థాయికి చేరింది. దీంతో ఉన్నాదిలా మారిన కోహ్లి.. నీరూని బ‌లంగా నెట్టేయ‌డంతో మెట్ల‌పై నుండి కింద ప‌డింది. ఈక్ర‌మంలో ఆమెకి గాయాల‌య్యాయి. అయితే అంత‌టితో ఆగ‌కుండా ఆమె జుట్టుపట్టుకొని త‌లని నేల‌కేసి బాదాడు. గాయ‌ప‌డ్డ నీరూ అతి క‌ష్టం మీద పోలీస్ స్టేష‌న్‌కి వెళ్ళి కోహ్లిపై ఫిర్యాదు చేసింది. నీరూ ఫిర్యాదు వెంట‌నే స్వీక‌రించి కేసు న‌మోదు చేసిన శాంతా క్రూజ్ పోలీసులు కొన్నాళ్లుగా నిందితుడి కోసం గాలించారు. తాజాగా అర్మాన్ కోహ్లీని అరెస్టు చేశామని ముంబై పోలీసులు చెప్పారు. అర్మాన్ కోహ్లీ ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ టీవీ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. అతను ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఎవరికీ తాను బయపడనని పేర్కొంది స్టైలిస్ట్ నీరూ .

4100
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS