తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న స్టైలిష్ డైరెక్టర్

Thu,October 11, 2018 11:36 AM
bobby gets father promotion

స్టార్ హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌వితేజ‌, ఎన్టీఆర్‌ల‌తో స్టైలిష్ చిత్రాల‌ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు బాబి. ఆయ‌న‌కి పండంటి బేబి జ‌న్మించిందని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. నా జీవితంలో ఇది ఎప్ప‌టిలాగానే స‌హ‌జ‌మైన రోజు. కాని నేటితో ఇది మెమ‌ర‌బుల్ డేగా మారింది. నాకు పాప పుట్ట‌డంతో కుటుంబం కాస్త పెద్ద‌దైంది. చాలా సంతోషంగా ఉంద‌ని ట్వీట్‌లో తెలిపారు బాబి. ఈ ట్వీట్‌కి ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్ కంగ్రాట్స్ బాబీ.. అమ్మవారి నవరాత్రుల్లో అమ్మాయి పుట్టింది’’ అంటూ ట్వీట్ చేశారు. మ‌రోవైపు ఆయ‌న అభిమానులు కూడా బాబీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. జై ల‌వకుశ త‌ర్వాత మరో సినిమాకి క‌మిట్ కాని బాబీ త్వ‌ర‌లో వెంక‌టేష్‌, నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంకీ మామ అనే సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ కోసం బాబీ క‌థా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని అంటున్నారు.

1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS