ఆసక్తి రేకెత్తిస్తున్న బ్ల‌ఫ్ మాస్ట‌ర్ ట్రైల‌ర్‌

Sat,December 8, 2018 12:19 PM
Bluff Master Trailer released

స‌త్యదేవ్‌, నందిని శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గోపి గ‌ణేష్ తెర‌కెక్కించిన చిత్రం బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌. డ‌బ్బు ప్ర‌ధానంగా రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో ప్ర‌మోష‌న్ జోరు పెంచారు మేక‌ర్స్ . తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో .."ఈ దునియాలో డబ్బున్నోడికే విలువ .. ఎంత ఎక్కువుంటే అంత విలువ .. ఎలాగైనా డబ్బును సంపాదించాలి .. ఆ తరువాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది" అని హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేదిలా వుంది. "ఈ దునియాలో బతకడానికి నింగి .. నేల .. నీరు .. నిప్పు .. గాలితో పాటు డబ్బు ఆరో భూతంలా మారిపోయింది'' అనే డైలాగ్ కూడా ఆక‌ట్టుకుంటుంది. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా మంచి హిట్ కొడుతుంద‌నే భావ‌న‌లో సినీ ప్రేక్ష‌కులు ఉన్నారు.

1755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles