హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతున్నది. రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ నటుడు బిత్తిరిసత్తికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ మేరకు బిత్తిరిసత్తి మూడు మొక్కలు నాటాడు. అనంతరం హాస్యనటుడు బ్రహ్మానందం, కల్వకుంట్ల హిమాన్షురావు, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేం శివజ్యోతికి మొక్కలు నాటాలని హరిత సవాల్ విసిరాడు. హరిత సవాలులో భాగంగా బ్రహ్మానందంకు ఓ మొక్కను అందజేశాడు బిత్తిరిసత్తి.
ఈ సందర్భంగా బిత్తిరిసత్తి మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతమంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటి..వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని బిత్తిరిసత్తి విజ్ఞప్తి చేశారు.

