భర్తకి స్వీట్ విషెస్ అందించిన బాలీవుడ్ భామ

Fri,February 23, 2018 03:37 PM
భర్తకి స్వీట్ విషెస్ అందించిన బాలీవుడ్ భామ

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ బిపాసా బసు , హెట్ స్టొరీ 3 ఫేం కరణ్ గ్రోవర్ సింగ్ ఏప్రిల్ 30, 2016లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెద్దల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా జరిగిన వీరి వివాహ వేడుకకి ప్రముఖ బాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ హాజరయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త దూరంగానే ఉంటున్న బిపాసా టైం దొరికిన వెంటనే విదేశాలకి వెళుతుంది. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అందిస్తూ వస్తుంది . ఇటీవల తను ప్రగ్నెంట్గా ఉందనే వార్తలు బీటౌన్లో షికారు చేశాయి. వీటిని కొట్టి పారేసింది బిపాసా. అయితే ఈ రోజు బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్ 36 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. గోవాలో తన భర్త బర్త్ డేకి గ్రాండ్ ప్లాన్ చేసింది బిపాసా. కొద్ది రోజుల క్రితమే గోవా చేరుకున్న ఈ జంట అక్కడి నుండి కూల్ పిక్చర్స్ షేర్ చేస్తున్నారు. ఈ రోజు తన హబ్బీ బర్త్ డే సందర్భంగా ఓ ఫోటో పోస్ట్ చేసి స్వీట్ విషెస్ చెప్పింది. ఇదిలా ఉంటే బిపాసా బర్త్ డే (జనవరి 7) రోజున తన ఇంటిని అందంగా అలంకరించాడు కరణ్. ఇది చూసి తెగ మురిసిపోయింది బిపాసా. 2015లో వచ్చిన ఎలోన్ అనే చిత్ర షూటింగ్ లో వీరి మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే.

It’s my baby’s Birthday ❤️ #monkeylove #monkeyprincebirthday

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

2005

More News

VIRAL NEWS