ప్రెగ్నెన్సీ రూమ‌ర్స్‌పై ఫైర్ అయిన బిపాసా

Thu,January 18, 2018 06:01 PM
bipasa fire on rumors

బాలీవుడ్ బ్యూటీ బిపాసా బ‌సు 2016లో కరణ్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెద్దల‌ స‌మ‌క్షంలో వివాహ బంధంతో ఒక్క‌టైన ఈ జంట లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. టైం దొరికిన వెంట‌నే విదేశాల‌కి వెళుతున్నారు. వాటికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా అందిస్తూ ఉంటుంది బిపాసా. అయితే ఇటీవ‌ల త‌ను ప్రగ్నెంట్‌గా ఉంద‌నే వార్త‌లు బీటౌన్‌లో షికారు చేశాయి. దీనిపై బిపాసా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చింది. ‘కారులో వెళుతున్నప్పుడు నా ఒడిలో బ్యాగ్‌ పెట్టుకున్నాను.ఫొటోగ్రాఫర్లకు సరిగ్గా కనపడక బ్యాగ్‌ను చూసి నేను గర్భం దాల్చానని అనుకుంటున్నారు. నేను గర్భవతిని కానని ఎన్నిసార్లు చెప్పాలి? ఈ విషయం నాకు చిరాకు కలిగిస్తుంటుంది. నాకు కావాలనుకున్నప్పుడే పిల్లల్ని కంటాను’ అని త‌న ట్వీట్ ద్వారా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బిపాసా. ఇక దీనిపై బిపాసా భ‌ర్త క‌ర‌ణ్ మాట్లాడుతూ ఇప్ప‌టికి పిల్ల‌లు ఎందుకు లేరు అన‌డంలో లాజిక్ లేదు. ఫ‌లానా స‌మ‌యంలో పిల్ల‌ల‌ని క‌నాలని ప్ర‌త్యేక రూల్స్ ఏమి లేవు కదా అంటూ క‌ర‌ణ్ పేర్కొన్నారు. బిపాసా తెలుగులో ట‌క్క‌రి దొంగ అనే సినిమాలోను న‌టించిన సంగ‌తి తెలిసిందే.


1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles