నరేంద్ర మోదీ బ‌యోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Fri,May 3, 2019 10:58 AM
Biopic PM Narendra Modi will be released on 24th May

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో ఒమంగ్ కుమార్ పీఎం నరేంద్ర మోదీ అనే టైటిల్‌తో చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న క్ర‌మంలో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఈ చిత్రాన్ని కొన్నాళ్ళపాటు నిషేదించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు మోదీ బయోపిక్‌ను రిలీజ్ చేయోద్దని ఇటీవ‌ల‌ ఈసీ త‌న నిర్ణ‌యం తెలిపింది . ఈ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జ‌రిపి ఈసీ తీర్పునే తుది నిర్ణ‌యంగా ప్ర‌క‌టించింది. దీంతో చిత్ర రిలీజ్ వాయిదా ప‌డ‌క త‌ప్ప‌లేదు. మే 19న చివరి విడత ఎన్నికలు ముగియనుండగా మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత ఎలాంటి నిబంధ‌నలు ఉండ‌వు కాబ‌ట్టి మే 24న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మేక‌ర్స్. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ ట్విటర్ ద్వారా మే 24న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నామ‌ని అధికారికంగా ప్రకటించారు.

పీఎం న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్‌లో మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబేరాయ్ న‌టిస్తుండ‌గా, ముఖ్య పాత్ర‌ల‌లో ప‌లువురు సీనియ‌ర్ న‌టులు న‌టిస్తున్నారు. భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్‌ షా పాత్ర‌ని మనోజ్ ‌జోషి చేస్తున్నాడు. మోదీ తల్లి హీరాబెన్‌ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్ క‌నిపించ‌నుంది. ఇక భార్య‌ జశోదాబెన్‌ పాత్రని బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా చేస్తుంది. ప్ర‌తినాయ‌కుడి పాత్రలో మ‌ర్డ‌ర్ 2 ఫేం ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్ న‌టిస్తున్నారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం 23 భాష‌ల‌లో విడుద‌ల కానున్న‌ట్టు టాక్.813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles