68 ఏళ్ళ వ్య‌క్తిని వివాహ‌మాడ‌నున్న 26 ఏళ్ళ పాప్ స్టార్

Wed,May 22, 2019 10:44 AM
Bill Murray and I Are Getting Married, says Selena Gomez

ఒక్కోసారి క్ష‌ణికావేశంలో చేసే ప‌నులు లేదా తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల‌న జీవితాంతం బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇప్పుడు న‌టి, పాప్ సింగ‌ర్ సెలీనా గోమేజ్ కూడా క్ష‌ణికావేశంలోనే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు. వివ‌రాల‌లోకి వెళితే తొలి సారి కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి హాజ‌రైన సెలీనా రెడ్ కార్పెట్‌పై హోయ‌లు పోయింది. ఆమె న‌టించిన ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమాను కేన్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌డంతో సెలీనా ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ చిత్రంలో సెలీనాతో పాటు బిల్ ముర్రే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.

రెడ్ కార్పెట్‌పై తాను న‌డిచిన ఫోటోని పోస్ట్ చేసిన పాప్ సింగ‌ర్ సెలీనా గోమేజ్(26) త్వ‌ర‌లో నా స‌హ‌న‌టుడు బిల్ ముర్రే(68)ని వివాహం చేసుకోబోతున్నాను అనే కామెంట్ పెట్టింది. ‘కేన్స్‌లో తొలిసారి పాల్గొన్నా. ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ చిత్రంలో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను అని పేర్కొంది. అయితే తన మాజీ ప్రియుడైన పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో సెలీనా కోపంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకుందా అని చ‌ర్చించుకుంటున్నారు. 26 ఏళ్ళ సెలీనా 68 ఏళ్ళ బిల్ ముర్రేని వివాహం చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన అంశంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

5345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles