పారితోషికం తీసుకోకుండానే న‌టించిన బిల్ గేట్స్‌

Wed,February 21, 2018 12:44 PM
పారితోషికం తీసుకోకుండానే న‌టించిన బిల్ గేట్స్‌

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ తెర‌పై మెర‌వ‌నున్నార‌నే వార్త అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ బిల్ గేట్స్ ఆ పాత్ర‌లో న‌టించినందుకు పారితోషికం కూడా తీసుకోలేద‌ట‌. 2001లో వ‌చ్చిన ఫ్రాసియ‌ర్ అనే కామెడీ సిరీస్ లో న‌టించిన గేట్స్ ఇప్పుడు హాలీవుడ్‌లో పాపులర్‌ అయిన కామెడీ సిరీస్‌ ‘ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ’లో గేట్స్‌ అతిథి పాత్రలో మెరవనున్నారు. నిజ‌జీవితంలో మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్న బిల్ గేట్స్ కామెడీ సిరీస్‌లోను అలానే క‌నిపించ‌నున్నాడ‌ట‌. వ‌చ్చే నెల‌లో ఈ ఎపిసోడ్‌ని ప్ర‌సారం చేయ‌నున్నారు.

1054

More News

VIRAL NEWS