లైంగిక వేధింపుల కేసులో క‌మిడియ‌న్‌కు 10 ఏళ్ల జైలుశిక్ష

Wed,September 26, 2018 08:17 AM
Bill Cosby gets 3 to 10 years in prison for sexual assault

పెన్సిల్వేనియా: ఫేమస్ అమెరికా క‌మిడియ‌న్‌ బిల్ కోస్బీకి జైలు శిక్ష పడింది. ఓ యువతిని అత్యాచారం చేసిన కేసులో ఆయనకు పెన్సిల్వేనియా కోర్టు మూడు నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం కోస్బీ వయసు 81 ఏళ్లు. 1980 దశకంలో అతనో పెద్ద స్టార్. అమెరికా డాడీ అంటూ ఆయన్ను గౌరవంగా పిలిచేశారు. హాలీవుడ్‌లో మీటూ ఉద్యమం మొదలైన తర్వాత.. లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడ్డ మొదటి సెలబ్రిటీ ఇతనే కావడం విశేషం. కోస్బీ చేతులకు బేడీలు వేసి.. కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్లారు. 2004లో ఆండ్రియా కాన్‌స్టాండ్ అనే మహిళకు మాదక ద్రవ్యాలు ఇచ్చి, ఆమెను శారీరకంగా వేధించినట్లు కోస్బీపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో దోషిగా తేలిన కమేడియన్ కోస్బీ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఆండ్రియా అందమైన ఆశలను కోస్బీ చిదిమేశాడంటూ మాంట్‌గోమేరీ కౌంటీ జడ్జి తన తీర్పులో వెల్లడించారు. అయితే బెయిల్ కోసం కోస్బీ పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

3920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles