ఆస‌క్తి రేకెత్తిస్తున్న బిగిల్ ట్రైల‌ర్

Sun,October 13, 2019 07:57 AM

విజ‌య్ క‌థానాయ‌కుడిగా అట్లీ తెర‌కెక్కిస్తున్న చిత్రం బిగిల్. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుద‌ల కానుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్‌గా క‌నిపించారు. అమ్మాయిల‌కి శిక్ష‌ణ ఇస్తున్న స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని మ‌హిళ‌ల‌కి అంకిత‌మిస్తున్న‌ట్టు చిత్ర బృందం పేర్కొంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న బిగిల్ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో విజ‌య్ డ్యూయ‌ల్ షేడ్స్‌లో క‌నిపించ‌నుండ‌గా, అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర కాగా, మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. అట్లీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.


922
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles