బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్టార్ హీరో ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,June 22, 2019 08:21 AM
Bigil first and Second Look released

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం అట్లీ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజ‌య్ బ‌ర్త్‌డే( జూన్ 22) సంద‌ర్భంగా చిత్ర టైటిల్‌తో పాటు రెండు లుక్స్‌ రివీల్ చేశారు మేక‌ర్స్. `బిగిల్‌`( విజిల్ అనే అర్థం) అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే.. మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావ‌ళికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

3257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles