సంక్రాంతి అల్లుళ్ళు సెంచ‌రీ కొట్టారు

Sun,April 21, 2019 10:59 AM
Biggest Blockbuster F2 Celebrating 100 Days

యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి కామిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఎఫ్‌2 చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి పోటీగా స్టార్ హీరోల సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికి ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించింది. సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల‌ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. బోనిక‌పూర్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్న‌ ఈ చిత్రాన్ని అనీస్ బ‌జ్మీ తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే తెలుగులో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన కామెడీ ఎంటర్టైన‌ర్ ఎఫ్‌2 ( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల‌కి ధ‌న్య‌వాదాలు తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఎఫ్2 చిత్రంలో వ‌రుణ్, వెంకీలు తోడ‌ల్లుళ్ళుగా న‌టిస్తే వారి పెళ్లాలుగా మెహ‌రీన్‌, త‌మ‌న్నాలు న‌టించారు. క‌థానాయిక‌లిద్ద‌రు న‌ట‌తోనే కాకుండా త‌మ గ్లామ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతంకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రాన్ని కూడా మంచి వినోదం అందించే చిత్రంగా తెర‌కెక్కించి స‌క్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ తో ప్రేక్షకుల కడుపు చెక్కలు అయ్యేలా చేశాడు.

1752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles