బిగ్ బాస్‌3 లో బిగ్ స్టార్స్‌

Thu,January 10, 2019 10:24 AM
bigg stars in bigg boss3

విదేశాల‌లో మొద‌లైన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హిందీలోను త‌న హ‌వా కొన‌సాగించింది. దీంతో దాదాపు సౌత్‌లోని అన్ని భాష‌ల‌లోను ఈ కార్య‌క్ర‌మం రూపొంది అతి పెద్ద విజ‌యం సాధించింది. ముఖ్యంగా తెలుగులో ఫ‌స్ట్ సీజ‌న్ ఎన్టీఆర్ హోస్ట్‌గా రూపొంద‌గా, ఈ కార్య‌క్ర‌మంకి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత సెకండ్ సీజ‌న్‌ని నాని హోస్ట్ చేశాడు. దీనిపై మిక్స్‌డ్ ఒపీనియ‌న్స్ వ‌చ్చాయి. సెకండ్ సీజ‌న్‌లో పెద్ద‌గా పాపుల‌ర్ వ్య‌క్తులు లేక‌పోవ‌డం, కార్య‌క్ర‌మం రొటీన్‌గా సాగ‌డంతో బుల్లితెర ప్రేక్ష‌కులు కాస్త బోర్‌గా ఫీల‌య్యారు. అయితే మూడో సీజ‌న్‌లో అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు నిర్వాహ‌కులు భారీ క‌స‌రత్తులు చేస్తున్నారు.

బిగ్ బాస్ 3 సీజ‌న్‌కి ఈ సారి హోస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి లేదంటే విక్ట‌రీ వెంక‌టేష్ ఉంటార‌ని ప్రచారం జ‌రుగుతుంది. ఇక కంటెస్టెంట్‌లుగా పాపుల‌ర్ వ్య‌క్తుల‌నే తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. తాజాగా బిగ్ బాస్ 3కి సంబంధించిన ఓ లిస్ట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. రేణు దేశాయ్, గద్దె సిందూర, శోభిత ధూళిపాల, వరుణ్‌ సందేశ్, ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, జబర్ధస్త్ పొట్టి గణేశ్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ 'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి ఉన్నారు. వీరిలో ఫైన‌ల్‌గా ఎంద‌రు ఉంటారు, కొత్త‌గా ఎవ‌రు జాయిన్ అవుతారు అనే దానిపై పూర్తి క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. సీజన్ 2 షూటింగ్ హైదరాబాద్ లో జరగడంతో ముందే షోకి సంబంధించిన విషయాలు బయటకి వచ్చేసేవి. ఈ నేప‌థ్యంలో ఈసారి మాత్రం హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్ వేయడం లేదని తెలుస్తోంది.

5735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles