ఈ వారం నామినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Tue,July 31, 2018 09:04 AM
bigg boss2 eliminations very intrsting

బిగ్ బాస్ సీజ‌న్ 2 స‌క్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని సోమ‌వారం నాడు 51వ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ 50 రోజుల కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు సంజ‌న‌, నూత‌న్ నాయుడు, కిరీటి, శ్యామ‌ల‌, భాను శ్రీ, తేజ‌స్వీలు ఎలిమినేట్ అయ్యారు. రీసెంట్‌గా పూజా రామ‌చంద్ర‌న్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మ‌రి కొద్ది రోజుల‌లో బ‌య‌ట‌కు వెళ్ళిన శ్యామ‌ల‌, నూత‌న్ నాయుడు మ‌ళ్ళీ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఇక ఎలిమినేష‌న్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రుగా ఎలిమినేట్ అయిన ఇంటి స‌భ్యులు ఈ వారం నుండి ఇద్ద‌రుగా వెళ్లిపోయే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ 2..ఏదైన జ‌ర‌గొచ్చు.

సోమ‌వారం నాడు రోల్ రైడా త‌న ర్యాప్ సాంగ్‌తో హౌజ్‌లో ఫుల్ ఎన‌ర్జీ నింపాడు. ప‌ర‌ప‌ర‌ప‌ర పప్పరా అంటూ ఒక్కో ఇంటి స‌భ్యుడి గురించి పాట పాడి అల‌రించాడు. రోల్ పాట‌కి మిగ‌తా వారు కూడా తాళం క‌లిపారు. అందరి గురించి రోల్ రైడా పాడితే రోల్ రైడా కోసం కౌశల్ పాడి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక ఆ త‌ర్వాత ఈ వారం ఎవ‌రి స్థానాలు ఎంత అనే విష‌యం త‌మ‌నే నిర్ణ‌యించుకోవాల‌ని ఇంటి స‌భ్యుల‌ని కోరాడు బిగ్ బాస్ . ర్యాంక్ బోర్డ్ ఎంపిక చేసుకునే విష‌యంలో రెండు అంశాలు గుర్తు పెట్టుకోవాల‌ని బిగ్ బాస్ అన్నారు. బిగ్ బాస్ ఇంట్లో మిమ్న‌ల్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ స్థానంలో చూసుకున్నారు. రెండు మిమ్మ‌ల్ని మీరు ఫైన‌ల్‌లో చూసుకునేందుకు ఎలాంటి మార్పు కావాల‌ని అనుకుంటున్నారు . ఈ రెండు అంశాల‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ర్యాంకు బోర్డుల వెనుక నిలుచోవాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. 1 పెద్ద ర్యాంకుగా, 12 చిన్న ర్యాంకుగా పరిగ‌ణ‌లోకి తీసుకోబ‌డుతుంది.

ర్యాంకు బోర్డుని ఎంపిక చేసుకునేముందు ఒక‌టి రెండు సార్లు ఆలోచించుకోవాలి.అంతేకాదు ఆ స్థానం ఎందుకు ఎంపిక చేసుకోవ‌ల‌సి వచ్చిందో వివ‌రించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలా లేదా అనే అంశంపై ప్ర‌భావం చూపుతుంది అని బిగ్ బాస్ పేర్కొన్నారు. బిగ్ బాస్ చెప్పిన‌ట్టుగా ఇంటి స‌భ్యులు అంద‌రు గార్డెన్ ఏరియాలో ఉన్న ర్యాంకు బోర్డ్స్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి నిలుచున్నారు. ‘ర్యాంక్ బోర్డ్’ ఎంపికలో తనీష్ నంబర్ వన్ స్థానంని ద‌క్కించుకోగా రోల్ రైడా నెంబర్ 2 స్థానంలో నిలబడ్డారు. ఇక మిగిలిన 3 స్థానం కోసం కౌశల్, దీప్తిలు పోటీ పడ్డారు. ఆ స్థానం ఎందుకు కావాలో ఒక‌రికొక‌రు చ‌ర్చించుకున్నారు. ఒకానొక స‌మయంలో వారిద్ద‌రు జోకులు కూడా వేసుకుంటుండ‌గా, బిగ్ బాస్ హెచ్చ‌రించారు. దీంతో ఇద్ద‌రు 3వ స్థానంలోనే నిలబడ్డారు.

నాలుగో స్థానంలో సామ్రాట్ నిల‌బ‌డగా, ఐదో స్థానంలో అమిత్ , ఆరో స్థానంలో సునయన , ఏడో స్థానంలో బాబు గోగినేని , ఎనిమిదో స్థానంలో గణేష్ , తొమ్మిదో స్థానంలో నందిని , ప‌ద‌కొండో స్థానంలో గీతా మాధురి, ప‌న్నెండో స్థానంలో పూజా రామ‌చంద్ర‌న్ నిలుచున్నారు. దీప్తి, కౌశ‌ల్‌లు ఒకే స్థానంలో ఉండ‌డంతో ప‌దో స్థానం ఖాళీగా ఉంది. అయితే మూడో స్థానం కోసం కౌశ‌ల్, దీప్తిల మ‌ధ్య చాలా సేపు చ‌ర్చ జ‌రిగింది. దీప్తి త‌ను మూడో ర్యాంకు ఎందుకు ఎంచుకుంద‌నే విష‌యం చెప్ప‌గా, కౌశ‌ల్ తాను మొద‌టి మూడు స్థానాల‌లో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపాడు. కొద్ది సేప‌టి త‌ర్వాత బిగ్ బాస్ ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ పూర్తైంద‌ని తెలిపారు. ఒక‌టి నుండి ఆరు స్థానాలు ఎంపిక చేసుకున్న వారు నామినేష‌న్ నుండి సుర‌క్షిత‌మ‌య్యార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు.

ఇక 7 నుండి 12 వరకూ స్థానాలను ఎంచుకున్న ఇంటి స‌భ్యులు ఈ వారం ఎలిమినేషన్‌లో ఉంటారని పెద్ద బాంబ్ పేల్చారు బిగ్ బాస్ . అయితే 11 వ స్థానంలో ఉన్న గీతా మాధురి ఈ వారం కెప్టెన్‌గా ఉండటం వల్ల, 12వ స్థానాన్ని ఎంచుకున్న పూజా రామచంద్రన్ ఈ వారమే బిగ్ బాస్ హౌస్‌కి రావడం వల్ల మినహాయింపు ఇచ్చారు. అయితే 3 వ స్థానం కోసం పోటీపడిన కౌశల్, దీప్తిలు తుది నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డం వల్ల కౌశల్, దీప్తి నల్లమోతులను ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు బిగ్ బాస్. దీంతో ఈ వారం ఎలిమేషన్‌లో బాబు గోగినేని, గణేష్, నందిని, కౌశల్, దీప్తిలు ఉన్నారు . ఈ ఐదుగురిలో ఒకరు, లేదా ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌ను వీడే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

మూడో స్థానంలో నిలుచున్న కౌశ‌ల్ ప‌క్క‌కి వెళ్లిన నిలుచున్న కార‌ణంగా ఇద్ద‌రు నామినేట్ కావ‌డంతో దీనిపై ఇంటి స‌భ్యులు కొద్ది సేపు చ‌ర్చ‌లు జ‌రిపారు. దీప్తి తాను ప‌దో స్థానంలో నిలుచున్న నామినేట్ అయ్యేది, కాని మూడో స్థానంలో నిలుచొని కౌశ‌ల్‌ని కూడా నామినేట్ చేయ‌డం మ‌హాభార‌తాన్ని త‌ల‌పిస్తుంద‌ని గీతా మాధురి చెప్పుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల బాల్యం ఫోటోలు చూపించి వాటిని రీక్రియేష‌న్ చేయాల‌నే టాస్క్ ఇచ్చారు. ఇందుకు మొబైల్స్ ఫోన్స్ వాడుకోవాల‌ని సూచించారు. బ‌జ‌ర్ మోగ‌డానికి ముందు అంద‌రు త‌మ బాల్యంకి సంబంధించిన గెట‌ప్స్ లోకి మార‌తారు. ఆ త‌ర్వాత బాల్యం గెట‌ప్స్‌లోకి మారిన వారు ఒక్కొక్క‌రుగా సోలో ఫోటోలు దిగుతూ, చివ‌రికి గ్రూప్ ఫోటోకి ఫోజులిచ్చారు. దీంతో సోమవారం నాటి ఎపిసోడ్ పూర్త‌వుతుంది.

3422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles