ఎన్టీఆర్ 'బిగ్ బాస్' టీజ‌ర్ విడుద‌ల‌

Sun,June 18, 2017 11:04 AM
Bigg Boss Telugu Tease

హిందీలో స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు త‌మిళం, తెలుగులోను సంద‌డి చేయ‌నుంది. త‌మిళంలో క‌మ‌ల్ ఈ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌నున్నాడు. ఈ కార్యక్ర‌మానికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, తాజాగా బిగ్ బాస్ తెలుగు ప్రోగ్రాంకి సంబంధించి 35 సెక‌న్ల టీజ‌ర్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ స్టైల్ , లుక్ ఫ్యాన్స్ మ‌తులు పొగొడుతుంది. త్వ‌ర‌లోనే ఈ కార్య‌క్ర‌మం ఓ ప్ర‌ముఖ ఛానెల్ లో ప్ర‌ద‌ర్శితం కానుంది. ప‌లువ‌రు సెల‌బ్రిటీల‌తో సాగే గేమ్ షోగా ఇది ఉంటుంద‌ని టాక్. ప్ర‌స్తుతం వెండితెర‌పై ఓ వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ బుల్లితెర‌పై ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

1905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS