అవును .. సునయ‌న‌కి అన్న‌య్య‌నే! : తనీష్‌

Thu,August 16, 2018 09:00 AM
bigg boss telugu gets very intresting

బిగ్ బాస్ సీజ‌న్ 2లో ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ కోసం ఇంటి స‌భ్యులు రెండు గ్రూపులుగా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. కొందరు ప‌బ్లిక్ కాల‌ర్స్‌గా మారితే మ‌రి కొంద‌రు కాల్ సెంట‌ర్ స‌భ్యులుగా మారారు. 66వ ఎపిసోడ్‌లో మొద‌లైన టాస్క్ 67వ ఎపిసోడ్‌లోను కంటిన్యూ అయింది. మంగ‌ళ‌వారం రోజు కౌశ‌ల్‌, దీప్తి సున‌య‌న‌ల మ‌ధ్య సీరియ‌స్ డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న క్ర‌మంలో సున‌య‌న ఫోన్ ప‌క్క‌న పెట్టి బ‌య‌ట‌కి వెళ్ల‌డంతో బిగ్ బాస్ కౌశ‌ల్‌కి ఒక పాయింట్ ఇచ్చారు. అయితే దీనిపై గీతా, త‌నీష్‌, దీప్తిలు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ మీరు మాట్లాడేది స్నేహితుల‌తో కాదు టాస్క్‌లో భాగంగా అవ‌త‌లి వ్య‌క్తితో అంటూ చుర‌క‌లు అంటించారు.

అయితే బిగ్ బాస్ నిబంధ‌న‌ల‌కి వ్య‌తిరేఖంగా త‌నీష్‌, దీప్తి సున‌య‌నలు స్టోర్ రూంలో ప‌డుకున్న కార‌ణంగా బిగ్ బాస్ వారికి శిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. ఇంటి స‌భ్యుల‌లో ఒక‌రికి 24 గంట‌లు విస‌న‌క‌ర్ర‌తో విసురుతూనే ఉండాల‌ని బిగ్ బాస్ చెప్ప‌గా, దానిని అతిక్ర‌మించి హాయిగా ప‌డుకున్నారు హ‌గ్ బ‌ర్డ్స్‌. దీంతో ఇంట్లో కుక్కలు మొరిగాయి. చేసేదేం లేక కూర్చొని ఆప‌సోపాలు ప‌డ్డారు దీప్తి, సున‌య‌న‌లు. ఒకానొక సంద‌ర్భంలో త‌నీష్ కాస్త భావోద్వేగానికి గురికావ‌డంతో దీప్తి సున‌య‌న ఓదార్చే ప్ర‌య‌త్నం చేసింది.

ఇక టాస్క్‌లో భాగంగా గ‌ణేష్ కొండంత ధైర్యాన్ని మూట‌గట్టుకొని కౌశ‌ల్‌తో వార్‌కి దిగాడు. ఎలా అయిన కౌశ‌ల్‌ని డిస్ట‌ర్బ్ చేసి పాయింట్ సాధించాలని ఫోన్ చేత‌ప‌ట్టాడు. ఇక ఛాన్స్ దొర‌క‌డ‌మే అదునుగా కౌశ‌ల్‌ని విప‌రీతంగా విసిగించాడు.
తనకు, బాబు గోగినేనికి మధ్య ఉన్న బంధాన్ని కౌశల్ వ్యతిరేకించడాన్ని ఫోన్ కాల్‌లో ప్రస్తావించాడు గ‌ణేష్ . ఇంట్లో కౌశ‌ల్ ప్ర‌వ‌ర్త‌న‌, త‌న‌కు మ‌ర్యాద ఇవ్వ‌క‌పోవ‌డం ప‌లు అంశాల గురించి మాట్లాడుతూ కౌశ‌ల్ స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. ఒకానొక స‌మ‌యంలో కౌశ‌ల్ ప‌ట్టు త‌ప్పుతాడేమో అనుకుంటుండ‌గా, కో స‌భ్యురాలు శ్యామ‌ల కౌశ‌ల్‌ని శాంత ప‌రచింది. బ‌జ‌ర్ మోగే వ‌ర‌కు ఇద్ద‌రు పోటా పోటీగా మాట్లాడుకోవ‌డంతో బిగ్ బాస్ వారిద్ద‌రికి చెరో పాయింట్ ఇచ్చారు.

ఇక బ‌జ‌ర్ మోగ‌డంతో కాల్ సెంటర్ స‌భ్యులు షిఫ్ట్‌లు మారారు. నూత‌న్ నాయుడు, దీప్తి, అమిత్‌లు త‌ర్వాతి షిఫ్ట్‌లోకి రాగా ముందుగా పూజా ..నూత‌న్ నాయుడుతో మాట్లాడింది. ఆ త‌ర్వాత దీప్తి తో.. సున‌య‌న‌, అమిత్ తో గ‌ణేష్ మాట్లాడారు. దీంతో బిగ్ బాస్ కాల్ సెంట‌ర్ టాస్క్ మొద‌టి అంకం పూర్తైన‌ట్టు బిగ్ బాస్ తెలిపారు. ఆ త‌ర్వాత కాల్ సెంట‌ర్ వ్యక్తులు ప‌బ్లిక్ కాల‌ర్స్‌గా మారారు. టాస్క్‌లో భాగంగా మొదటి కాల్ శ్యామలా.. గ‌ణేష్ తో మాట్లాడింది. తెలుగు స‌రిగ్గా మాట్లాడలేక‌పోవ‌డంతో ముందు తెలుగు నేర్చుకోమ‌ని అంది. తనకు తెలుగులో 32 మాటలు మాత్రమే వచ్చని చెప్పాడు. కామ‌న్ మేన్ రిప్ర‌జెంటేటివ్ అయి ఉండి ఇద్ద‌రు భార్య‌లు, తెలుగు రాదు అని చెప్ప‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. నువ్వు ఫోన్ పెట్టు ముందు అంటూ గ‌ణేష్‌ని బాగ‌నే విసిగించింది శ్యామ‌ల‌.

ఈ మ‌ధ్య‌లో గీతా మాధురి- సామ్రాట్‌ల మ‌ధ్య చూపుల‌తో దోబూచులాట జ‌రిగింది. ఒకరినొక‌రు క‌ళ్ళ‌ల‌లో చూసుకుంటూ తెగ సిగ్గుప‌డిపోయారు. అయితే గ‌ణేష్‌, శ్యామ‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతూనే ఉండ‌గా బిగ్ బాస్ షిఫ్ట్ చేంజ్ బెల్ మోగించారు. దీప్తి, పూజాలు మాట్లాడ‌కుండానే వారి షిఫ్ట్ ముగిసింది. అయితే శ్యామ‌ల‌, గ‌ణేష్ ఇద్ద‌రు ఫోన్ పెట్ట‌క‌పోవ‌డంతో ఇరు టీంల‌కి ఒక్కో పాయింట్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక త‌ర్వాతి షిఫ్ట్‌లోకి త‌నీష్‌, రోల్ రైడా, దీప్తి సున‌య‌న‌లోకి వ‌చ్చారు. ఇందులో భాగంగా కౌశ‌ల్ మొద‌టి కాల్ త‌నీష్‌తో మాట్లాడాడు. ఒక‌వైపు త‌నీష్‌ని విసిగించాల‌ని కౌశ‌ల్ ప్ర‌య‌త్నించ‌గా, త‌నీష్ .. కౌశ‌ల్‌ని చెట్టెక్కించాడు. ఒక్కొక్క‌రిలో పాజిటివ్ విష‌యాలు చెబుతూ వెళ్లాడు త‌నీష్‌.

కౌశ‌ల్‌ని అంద‌రు టార్గెట్ చేస్తున్నార‌ని మీరు అనుకుంటున్నారా లేదా అని కౌశ‌ల్‌.. త‌నీష్‌ని అడిగాడు. అందుకు లేద‌ని చెప్పాడు. మీకు కౌశ‌ల్‌లో ఏమి న‌చ్చ‌లేద‌ని త‌నీష్‌ని అడ‌గ‌గా అత‌నిలో తెలియ‌ని బాస్ ఇజం ఉంటుంది, కొన్ని గ‌ట్టిగా చెబితే అర్దం చేసుకుంటారు అని చెప్పాడు. కెప్టెన్ టాస్క్‌లో దీప్తిపై ఫిజిక‌ల్ హ్యాండిల్ చేయ‌డం గురించి కూడా త‌నీష్‌ని కౌశ‌ల్ ప్రశ్నించాడు. దీప్తి ప్లేస్‌లో సున‌య‌న ఉంటే అలా ఆడేవారా, అంతేకాదు నామినేష‌న్ కోసం ఓ సారి సున‌య‌న‌ని కాపాడారు. ఆమె ప్లేస్‌లో వేరే వారు ఉంటే ఆ ఛాన్స్ ఇచ్చేవారా. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ఆ రిలేష‌న్ షిప్ ఏంటి అని కౌశ‌ల్ అడిగాడు. సున‌య‌న‌కి మీకు సోద‌రినా, ఫ్రెండా ఇంకేమైన‌నా అని కౌశ‌ల్ అడ‌గ‌గా, నువ్వు ఏమ‌నుకుంటున్నావు ఎదురు ప్ర‌శ్నించాడు త‌నీష్‌. దీనికి కౌశ‌ల్.. ఫ‌స్ట్ నుండి త‌ను నిన్నుబ్రో అని పిలిచింది కాబ‌ట్టి నేను సోద‌రుడు అనుకుంటున్నాను అని కౌశ‌ల్ అన్నాడు. ఇందుకు త‌నీష్ అవును అని స‌మాధానం ఇచ్చాడు.

మీరు అమ్మాయిలను బాగా పడేస్తారని తెలిసిందని కౌశల్ అంటే.. ఈ విషయంలో నాకు కౌశల్ గురువంటూ తనీష్ సమాధానం ఇచ్చాడు. నందిని బాగుంటుందని, అందుకే లైన్ వేశానని కౌశ‌ల్‌ చెప్పాడు. నందినీకి మీరు కూడా లైనేశారు కదా అని కౌశల్‌కు చురకలు అంటించాడు. టాప్ 3లో దీప్తి, నేను నిలుచున్నాం ఒక‌సారి . మీరు ఆ నెంబ‌ర్‌కి ఎవ‌రైతే క‌రెక్ట్ అని అనుకుంటున్నారు అని అడ‌గ‌గా, త‌నీష్ స‌ర‌దాగా స‌మాధానం ఇచ్చాడు . ఇలా త‌నీష్‌,కౌశ‌ల్‌లు మాట్లాడుకుంటూ ఉంటున్న స‌మ‌యంలో బిగ్ బాస్ కాల్ సెంట‌ర్ టాస్క్ ఈ రోజుకి పూర్తైంద‌ని మిగతాది రేపు ప్రారంభం అవుతుంద‌ని అన్నారు. అయితే ఇటు త‌నీష్‌, కౌశ‌ల్ క‌ట్ చేయ‌ని కార‌ణంగా త‌నీష్‌, కౌశ‌ల్‌కి ఒక్కో పాయింట్ ఇచ్చారు బిగ్ బాస్.

త‌నీష్‌, సున‌య‌న‌ల‌కి బిగ్ బాస్ విధించిన శిక్ష పూర్తైంద‌ని తెలియ‌జేశారు. ఆ త‌ర్వాత పూజా బిగ్ బాస్ ని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేసింది. ఇక టాస్క్ సమ‌యంలో చూపులు క‌లుపుకున్న గీతా, సామ్రాట్‌లు అర్ధ‌రాత్రి స‌మ‌యంలో బోలెడ‌న్ని క‌బుర్లు చెప్పుకున్నారు. దీంతో 67వ ఎపిసోడ్ ముగిసింది. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఏమేం జ‌ర‌గ‌నుందో తెలియాంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

6319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles